RRR అలైన్‌మెంట్‌పై హరీష్ రావు విమర్శలు.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోందని ఆగ్రహం

RRR అలైన్‌మెంట్‌పై హరీష్ రావు విమర్శలు.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోందని ఆగ్రహం
x
Highlights

Harish Rao: RRR ప్రాజెక్టు అలైన్మెంట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిగా మారుస్తూ పేద రైతుల పొట్ట కొడుతుండటం దుర్మార్గమన్నారు హరీష్‌రావు.

Harish Rao: RRR ప్రాజెక్టు అలైన్మెంట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిగా మారుస్తూ పేద రైతుల పొట్ట కొడుతుండటం దుర్మార్గమన్నారు హరీష్‌రావు. సంగారెడ్డిలో ఇష్టారీతిన RRR అలైన్మెంట్ మార్చి తమ కడుపు కొడుతున్నారని కొండాపూర్ మండల రైతులు హరీష్ రావుని కలిసి తమ ఆవేదనను చెప్పుకున్నారు. కాంగ్రెస్ అనాలోచిత చర్యలతో రైతులు పంట భూములు కోల్పోతున్న పరిస్థితి ఉందన్నారు. పచ్చని పొలాల గుండా అలైన్మెంట్ చేసి, రైతన్న నోట్లో మట్టి కొడుతున్నారన్నారు. RRR అలైన్మెంట్‌తో రేవంత్ తీరు రైతులకు శాపంగా మారాయన్నారు. రైతులు భూములు కోల్పోకుండా RRR అలైన్మెంట్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం గిర్మాపూర్ చేవెళ్ల మీదుగా ప్రతిపాదించామన్నారు హరీష్‌రావు. కానీ రేవంత్ ప్రభుత్వం తన స్వలాభం కోసం వికారాబాద్, పరిగి, కొడంగల్ మీదుగా ట్రిపుల్ ఆర్ మార్గాలన్ని అడ్డగోలుగా తిప్పుతూ పచ్చటి పొలాలను మాయం చేసే కుట్రకు తెరలేపారని విమర్శించారు. ఎన్నికల ముందు ట్రిపుల్ ఆర్‌ను వ్యతిరేకించిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే రైతులను బలిచేస్తూ కాంగ్రెస్ నేతల భూములను కాపాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కేవలం సంగారెడ్డి నియోజకవర్గ సమస్య కాదన్నారు మాజీమంత్రి హరీష్‌రావు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ విషయంలో ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ఇష్టారీతిన అలైన్మెంట్‌ని మారుస్త రైతుల జీవితాలతో ఆడుకుంటుందన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పరిధిలో RRR అలైన్మెంట్‌పై భూ నిర్వాసితులు ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు హరీష్‌రావు. సొంత భూముల కోసం అలైన్మెంట్లు మార్చడం వల్ల వేల కోట్ల భారం ప్రజలపై పడుతుందన్నారు. రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టే చర్యలు ఆపకపోతే BRS తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories