Harish Rao: ఇది ముమ్మాటికి రేవంత్‌రెడ్డి చేయించిన దాడే

Harish Rao: దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

Shashank Gullapelli
Published on: 12 Sept 2024 5:05 PM IST
Harish Rao Slams Revanth Reddy
X

Harish Rao: ఇది ముమ్మాటికి రేవంత్‌రెడ్డి చేయించిన దాడే

Harish Rao: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిపై మాజీ మంత్రి హరీష్‌రావు స్పందించారు. దాడి బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుందన్నారు. ఈ దాడిని ప్రభుత్వమే.. చేయించిందని... సీఎం రేవంత్ రెడ్డి చేయించారని హరీష్‌రావు ఆరోపించారు. ఇదేనా కాంగ్రెస్ చెప్పిన ప్రజాస్వామ్యం, ఇదేనా ప్రజాపాలనా..? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే.. అంటూ హరీష్ రావు నిలదీశారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడంతో పాటు.. వారినే ఉసిగొల్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అని హరీష్ రావు అభివర్ణించారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్భలంతోనే ఈ దాడి జరిగిందన్నారు. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందన్నది పోలీసుల వైఖరితో సుస్పష్టంగా తెలుస్తుందన్నారు. ఇంటి మీదకు వస్తామని ప్రెస్ మీట్ లో ప్రకటించి, అనుచరులతో దాడి చేసినప్పటికీ నిలువరించడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ తీవ్రంగా విఫలమైంది. పట్టపగలు ప్రజాప్రతినిధిపై జరిగిన ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. దాడి చేసిన గాంధీని, అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ తరపున హరీష్‌రావు డిమాండ్ చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story