Telangana Thalli Statue: తెలంగాణ తల్లి విగ్రహంపై పలువురి నేతల అభిప్రాయాలివే..ఏమన్నారంటే..?

Here are the Responses From Leaders on Telangana Thalli Statue
x

Telangana Thalli Statue: తెలంగాణ తల్లి విగ్రహంపై పలువురి నేతల అభిప్రాయాలివే..ఏమన్నారంటే..?

Highlights

New Telangana Thalli Statue: స్వంత ఎజెండాతో తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయాలు చేస్తున్నారని సీతక్క విమర్శించారు.

New Telangana Thalli Statue: స్వంత ఎజెండాతో తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయాలు చేస్తున్నారని సీతక్క విమర్శించారు. అసెంబ్లీలో మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నారని విమర్శలు చేశారు. గత 10 ఏళ్లలో ఎక్కడైనా తెలంగాణ తల్లి విగ్రహన్ని అధికారికంగా ఆవిష్కరించారా అని ఆమె ప్రశ్నించారు. కేటీఆర్ సోదరికి దేవతా విగ్రహ రూపాన్ని ఇస్తే ఎలా ఉంటుందో అలా విగ్రహన్ని ప్రజలపై రుద్దారని ఆమె ఆరోపించారు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పెట్టిన విగ్రహన్ని చూస్తే తమ అక్కా చెల్లెళ్లను చూసినట్టే ఉందని ఆమె అన్నారు.తెలంగాణ బిడ్డల అస్తిత్వానికి అనుగుణంగా విగ్రహన్ని రూపొందించినట్టు ఆమె చెప్పారు.

రాజకీయ కోణంలో తెలంగాణ తల్లి విగ్రహన్ని వివాదం చేయవద్దు: కూనంనేని

రాజకీయ కోణంలో తెలంగాణ తల్లి విగ్రహన్ని వివాదం చేయవద్దని సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు. సోమవారం ఆయన తెలంగాణ అసెంబ్లీలో ప్రసంగించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకొంటే బాగుండేదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్కరిది ఒక్కో పాత్ర అని ఆయన చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహవిష్కరణలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన కోరారు.

తెలంగాణ తల్లి విగ్రహవిష్కరణను రాద్దాంతం చేస్తున్నారు: కోమటిరెడ్డి

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సోనియాగాంధీ కారణమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఆమె లేకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహవిష్కరణను ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.10 ఏళ్లలో నీళ్లు, నిధులు, నియామకాలు ఏమీ రాలేదన్నారు. అమ్మ లాంటి తెలంగాణ తల్లి విగ్రహన్ని ఆవిష్కరించుకుంటున్న రోజున శుభాకాంక్షలు చెప్పకుండా నిరసన వ్యక్తం చేయడంపై ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణ సాధన కోసం తాను అప్పట్లో ఆమరణ దీక్ష చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ప్రజల భావాలకు అనుగుణంగా తెలంగాణ తల్లి విగ్రహం: పొన్నం ప్రభాకర్

ప్రజల భావాలకు అనుగుణంగా తెలంగాణ తల్లి విగ్రహన్ని రూపొందించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.గతంలో ఉన్న విగ్రహలు పార్టీకి సంబంధించినవన్నారు. తెలంగాణ గీతాన్ని అధికారికంగా ఉపయోగిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.

కాంగ్రెస్ తల్లిగా మార్చారు: కవిత

తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. దీంతో తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోందని ఆమె మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మను మాయం చేసి తెలంగాణ ప్రత్యేకత లేకుండా చేశారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories