కాళేశ్వరం నివేదికపై కేసీఆర్‌, హరీశ్‌ పిటిషన్‌.. విచారణ వాయిదా

కాళేశ్వరం నివేదికపై కేసీఆర్‌, హరీశ్‌ పిటిషన్‌.. విచారణ వాయిదా
x
Highlights

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కమిషన్‌ నివేదికపై హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కమిషన్‌ నివేదికపై హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నివేదికను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.

విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వం తరఫు అడ్వకేట్ జనరల్‌ను ప్రశ్నిస్తూ– “కమిషన్‌ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ అనంతరం మాత్రమే చర్యలు తీసుకుంటారా?” అని స్పష్టత కోరింది. దీనిపై స్పందించిన ఏజీ, ప్రభుత్వ నిర్ణయం వివరించేందుకు కొంత సమయం కావాలని హైకోర్టును అభ్యర్థించారు.

దీనితో హైకోర్టు విచారణను శుక్రవారం వరకు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో, ఈ కేసు విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories