ఇవాళ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

Avinash Reddy: ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న విచారణ

Arun Chilukuri
Updated on: 26 May 2023 9:15 AM IST
High Court Hearing on Avinash Reddy Anticipatory Bail Petition
X

ఇవాళ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ 

Avinash Reddy: వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. నిజానికి ఈ పిటిషన్‌పై నిన్న హైకోర్టు విచారించింది. కానీ కోర్టు సమయం ముగిసే సమయంలో విచారణ మొదలుపెట్టింది. వాదనలు ఎక్కువ సేపు జరిగేలా ఉండటంతో విచారణ నేటికి వాయిదా వేసింది. ఇవాళ ఉదయం 10 గంటల 30నిమిషాలకి విచారణ ప్రారంభం కానుంది.

అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ముగ్గురు లాయర్లు తమ వాదన వినిపించనున్నారు. ఒకరు సీబీఐ తరపు లాయర్, మరొకరు అవినాష్ రెడ్డి తరపు సీనియర్ లాయర్ ఉమామేశ్వరరావు, ఇంకొకరు సునీతా రెడ్డి తరపు లాయర్ ఎల్ రవిచందర్. వీరంతా నిన్నటి విచారణలో ఎవరికి వారు తమ వాదనలకు కనీసం గంట టైమ్ కావాలని అడిగారు. అంటే ఇవాళ ముగ్గురికీ గంట చొప్పున మొత్తం విచారణకు 3 గంటలు పట్టొ్చ్చని తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story