High Court: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ

High Court: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ
x

High Court: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ

Highlights

ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో స్పష్టం చేయాలని ప్రభుత్వానికి, ఈసీకి ఆదేశం చర్చించి నిర్ణయం చెప్పేందుకు రెండు వారాల సమయం కోరిన అధికారులు బీసీ రిజర్వేషన్ల సమస్యతో నోటిఫికేషన్ నిలిపివేశామన్న ఈసీ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ప్రశ్నించింది. స్థానిక ఎన్నికలపై హైకోర్టు విచారణ జరిపింది. ఎన్నికల నిర్వహాణపై ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ చర్చించి చెప్పాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచూ ప్రభుత్వం జారీచేసిన జీవోను హైకోర్గు కొట్టివేసింది. దీంతో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేయడానికి సవాలు చేస్తూ సురేందర్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా, సుప్రీంకోర్టు కూడా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని చెప్పింది కదా అని హైకోర్టు గుర్తు చేసింది. దీనిపై ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది స్పందిస్తూ, సుప్రీంకోర్టు కేవలం ఎన్నికలు పెట్టుకోవచ్చని ఓరల్‌గా మాత్రమే చెప్పిందని.. ఆర్డర్‌లో ఎక్కడా చెప్పలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాశామని కోర్టుకు తెలిపారు. బీసీ రిజర్వేషన్లలను 42 శాతానికి పెంచుతూ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టే దాన్ని సస్పెండ్ చేశాం. మళ్లీ రిజర్వేషన్లను గూర్చి ప్రభుత్వంతో చర్చించాకే రీ నోటిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. రెండు వారాల సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం కోర్టును కోరడంతో తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories