Womens Day Gift Campaign 2023: మహిళాదినోత్సవం స్పెషల్‌ గిఫ్ట్‌ క్యాంపెయిన్‌.. నవజాత బాలికలకు బహుమతులు..!

HMTV & JCI Hyderabad SUPAR Gift Campaign Program on the Occasion of International Womens Day
x

Womens Day Gift Campaign 2023: మహిళాదినోత్సవం స్పెషల్‌ గిఫ్ట్‌ క్యాంపెయిన్‌.. నవజాత బాలికలకు బహుమతులు..!

Highlights

Womens Day Gift Campaign 2023: అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా హెచ్‌ఎంటీవీ జేసీఐ హైదరాబాద్ సూపర్‌ - గిఫ్ట్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది.

Womens Day Gift Campaign 2023: అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా హెచ్‌ఎంటీవీ జేసీఐ హైదరాబాద్ సూపర్‌ - గిఫ్ట్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మహిళా దినోత్సవం రోజున ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించిన నవజాత బాలికలకు గిఫ్ట్‌ బాక్సులు అందజేస్తారు. ఈ బాక్స్‌లలో 10 గ్రాముల వెండి నాణెం, స్వీట్ బాక్స్, కొన్ని ఆటబొమ్మలు ఉంటాయి. ఈ కార్యక్రమం HMTV, 24X7 తెలుగు న్యూస్ ఛానెల్, JCI హైదరాబాద్ SUPAR అధ్వర్యంలో జరుగుతుంది.

సమాజంలో మహిళలు, ఆడపిల్లల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ గిఫ్ట్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హెచ్‌ఎంటీవీ సీఈవో శ్రీమతి లక్ష్మీరావు మాట్లాడుతూ.. ఈ క్యాంపెయిన్‌ సమాజంలో మహిళలు, ఆడపిల్లల ఆవశ్యకత, విలువలని తెలియజేస్తుందన్నారు. సృష్టికి మూలం మహిళ అని అలాంటి మహిళని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సమానత్వ హక్కులు సాధించడానికి మహిళలందరు ఐక్యంగా మహిళా దినోత్సవం జరుపుకోవాలని సూచించారు.

ఆడపిల్లలకి మద్దతు, సంరక్షణ అందించడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని ప్రాజెక్ట్ చైర్మన్ GIFT క్యాంపెయిన్ జెజె ప్రసాద్ బాబు అన్నారు. మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న వివక్ష, సవాళ్లను, లింగ సమానత్వాన్ని పెంపొందించడంలో సమాజం పోషించగల పాత్రను హైలైట్ చేయడమే ప్రచార లక్ష్యమని జెసిఐ హైదరాబాద్ సుపార్ ప్రెసిడెంట్ శ్రీ నికీలు గుండా పేర్కొన్నారు. ప్రతి ఆడపిల్ల ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన ప్రేమ, సంరక్షణ పొందేలా చూడడమే ఈ ప్రచార అంతిమ లక్ష్యం. మరిన్ని వివరాల కోసం jcihyderabadsupar.comని చూడండి.

Show Full Article
Print Article
Next Story
More Stories