
Holi celebrations rules
Holi celebrations rules: హొలీ పండుగ రోజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆకతాయిలను హెచ్చరించారు.
Holi celebrations rules: రంగుల కేళి హొలీ వేడుకకు అంతా సిద్ధం అవుతున్నారు. హొలీ పండుగ అంటేనే ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ.. ఆనందాన్ని పంచుకునే వేడుక. అయితే, ఈ వేడుకల్లో ఆకతాయితనంగా వ్యవహరించే వారు కూడా కొందరు ఉంటారు. ఇలాంటి వారి వల్ల పండుగ సరదాగా గడిపే వారికి ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే, ఇలాంటి వారికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్.
హోలీ పండుగను పురస్కరించుకుని ప్రజలు శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలని, నిబంధనలను అతిక్రమించి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పండుగ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
ముఖ్యంగా పాదాచారుల మీద, వాహనదారుల మీద వారి ఇష్టానికి వ్యతిరేకంగా రంగులు చల్లడం లేదా నీళ్లు పోయడం వంటి పనులు చేయవద్దని కమిషనర్ హెచ్చరించారు. ఇతరుల అనుమతి లేకుండా రంగులు పూయడం నేరమని, దీనిని వేధింపుల కింద పరిగణిస్తామన్నారు.
Holi celebrations rules: హోలీ వేడుకల్లో భాగంగా ఎక్కడా డీజే (DJ) సౌండ్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేయడానికి కూడా అనుమతి లేదన్నారు. శబ్ద కాలుష్య నిబంధనలను ఉల్లంఘించి, అధిక శబ్దంతో పాటలు ప్లే చేస్తే డిజే పరికరాలను స్వాధీనం చేసుకుంటామని ఆయన తెలిపారు.
యువకులు గుంపులు గుంపులుగా బైకులపై తిరుగుతూ న్యూసెన్స్ సృష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ తిరిగే వాహనాలను వెంటనే సీజ్ చేస్తామని, వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని సజ్జనార్ పేర్కొన్నారు.
పండుగ వేళ మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని, అందువల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను కఠినతరం చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే భారీ జరిమానాలతో పాటు లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.
వైన్ షాప్స్ పై ఆంక్షలు..
Holi celebrations rules: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా హోలీ రోజున మద్యం దుకాణాలు, బార్లపై ఆంక్షలు విధించారు. రేపు సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాప్స్ మరియు బార్లను పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే షాపులపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
ప్రజలు హోలీ ని ఒక పండుగగా, స్నేహపూర్వకంగా జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్ కోరారు. ఒకవేళ ఎవరైనా వేడుకల పేరుతో ఇబ్బంది పెట్టినా, అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే 'డైల్ 100'కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




