Hooligans in Madhapur: బైక్‌పై వెళ్తున్న యువతిని వెంబడించిన ఆకతాయిలు

Hooligans in Madhapur: బైక్‌పై వెళ్తున్న యువతిని వెంబడించిన ఆకతాయిలు
x

Hooligans in Madhapur: బైక్‌పై వెళ్తున్న యువతిని వెంబడించిన ఆకతాయిలు

Highlights

మాదాపూర్‌లో యువతుల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తేలా ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై స్వేచ్ఛగా వెళ్తున్న అమ్మాయిలను వెంబదించి వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం ఆకతాయిలకి అలవాటైపోయింది. తాజాగా మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన దీనికి నిదర్శనం.

ఘటన వివరాలు

ఇద్దరు అమ్మాయిలు బైక్‌పై వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన ముగ్గురు యువకులు స్కూటీపై వారిని వెంబదించారు. వారిని చూసి అసభ్యంగా కామెంట్లు చేయడమే కాకుండా తాకేందుకు ప్రయత్నించారు. భయాందోళనకు గురైన ఆ అమ్మాయిలు ఏమీ చేయలేక నిశ్శబ్దంగా ముందుకు సాగిపోయారు. ఈ దృశ్యాలను వెనుక వస్తున్న కారులోని వ్యక్తి వీడియోలో రికార్డ్ చేశాడు.

ఆకతాయిల పరార్‌

వీడియో తీస్తున్నట్లు గమనించిన యువకులు ఆ వ్యక్తిని బెదిరించగా, అతను పట్టించుకోలేదు. దీంతో భయంతో బైక్ స్పీడ్ పెంచి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ వీడియో ఎక్స్‌లో వైరల్ కావడంతో మాదాపూర్ పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బైక్ నెంబర్ ఆధారంగా ఆరా తీయగా, వారంతా మైనర్లేనని గుర్తించారు. సీసీ కెమెరాల సహాయంతో వారిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

నగరవాసుల ఆందోళన

ఒక్కటి రెండు కాదు, ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిఘా ఎక్కడ? యువతుల భద్రతకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అనే ప్రశ్నలు లేవుతున్నాయి. బహిరంగ రహదారులపైనే అమ్మాయిలు వేధింపులకు గురవుతుంటే, భవిష్యత్తులో పరిస్థితి ఎటు దారితీస్తుందోనన్న భయం నగరంలో నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories