భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
x
Highlights

నగరంలోని నల్లకుంటలో నివాసం ఉంటున్ననల్గొండ జిల్లా హుజురాబాద్‌కు చెందిన ఓ భర్త భార్యపై పెట్రోల్ పోసి, నిప్పంటించి హత్య చేశాడు.

హైదరాబాద్: నగరంలోని నల్లకుంటలో నివాసం ఉంటున్ననల్గొండ జిల్లా హుజురాబాద్‌కు చెందిన ఓ భర్త భార్యపై పెట్రోల్ పోసి, నిప్పంటించి హత్య చేశాడు. అడ్డుపడిన కుమార్తెని కూడా అదే మంటల్లోకి నెట్టి పరారయ్యాడు. నల్గొండ జిల్లా హుజురాబాద్‌కు చెందిన వెంకటేష్, త్రివేణి దంపతులు నల్లకుంటలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా భార్య‌ను వెంకటేష్ తరచూ అనుమానిస్తుండే వాడు. ఈ విషయంపై భార్యను వెంకటేష్ నానారకాలుగా వేధించేవాడు. ఈ కారణంగా వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

భర్త వేధింపులు తాళలేక పుట్టింటికి వెళ్లిన భార్య త్రివేణికి మాయమాటలు చెప్పి, మళ్లీ ఇంటికి తీసుకువచ్చాడు. తాను మారానని, ఇకపై బాగా చూసుకుంటానంటూ నమ్మించి, త్రివేణిని హైదరాబాద్‌ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన కొద్దిరోజులకే ఆమెతో ఎప్పటిలాగే అనుమానంతో వేధించసాగారు. భార్యతో గొడవకు దిగిన వెంకటేష్, రెచ్చిపోయి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. అడ్డుకున్న కూతురిని కూడా మంటల్లో తోసేసిన వెంకటేష్ పరారయ్యాడు.

అరుపులు, కేకలు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే త్రివేణి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కూతురుకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలించి, 12 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు.

అనుమానంతో భార్యను హత్య చేసి, భర్త జైలు పాలవడంతో.. వారి ఇద్దరు చిన్నారులు అనాదలుగా మిగిలిపోయారు. తల్లి కోసం చిన్నారులు విలపిస్తున్న తీరు అక్కడి వారిని తీవ్రంగా కలిచివేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories