Hyderabad: పాల ప్యాకెట్లు కాదు.. కల్లు ప్యాకెట్లు! హోటల్‌లో నకిలీ కల్లు కలకలం

Hyderabad: పాల ప్యాకెట్లు కాదు.. కల్లు ప్యాకెట్లు! హోటల్‌లో నకిలీ కల్లు కలకలం
x

Hyderabad: పాల ప్యాకెట్లు కాదు.. కల్లు ప్యాకెట్లు! హోటల్‌లో నకిలీ కల్లు కలకలం

Highlights

హైదరాబాద్‌లో నకిలీ కల్లు కలకలం రేపింది. సాధారణంగా హోటళ్లలో తినుబండరాలతో పాటు పాల ప్యాకెట్లు కనిపించడం సహజం.

హైదరాబాద్‌లో నకిలీ కల్లు కలకలం రేపింది. సాధారణంగా హోటళ్లలో తినుబండరాలతో పాటు పాల ప్యాకెట్లు కనిపించడం సహజం. కానీ, గుండ్లపోచంపల్లి అయోధ్యనగర్‌లోని ఓ హోటల్‌లో ఎస్‌వీఎస్ బ్రాండ్‌ పేరుతో కల్లు ప్యాకెట్లు దొరకడంతో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది ఆశ్చర్యపోయారు.

సమాచారం అందుకున్న సీఐ సుబాష్‌ చందర్, ఎస్సైలు అఖిల్, రవిచంద్ర హోటల్‌పై దాడి చేసి 270 లీటర్ల కల్లు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. హోటల్ నడుపుతున్న శంకర్ గౌడ్ ఎక్కడి నుంచి ఈ కల్లు తెచ్చుకున్నాడన్న ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడంతో అతన్ని కల్లు ప్యాకెట్లతో సహా మేడ్చల్ ఎక్సైజ్ స్టేషన్‌కి తరలించారు.

ఇంకా ఎక్కడ దాడులు?

మల్కాజిగిరి పరిధిలో అనుమతి లేకుండా అమ్ముతున్న 20 లీటర్ల కల్లును నాశనం చేశారు.

మల్కాజిగిరి ఎక్సైజ్ టీమ్ సైదాబాద్‌లో దాడులు చేసి, 750 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకుంది.

పల్లె బిక్షపతి, బోడిగే శ్రీనివాస్ గౌడ్ లపై కేసులు నమోదు చేసి, కల్లు శాంపిల్స్ సేకరించారు.

ప్రధాన అంశాలు

హోటల్‌లో నకిలీ కల్లు ప్యాకెట్లు స్వాధీనం

ఎస్‌వీఎస్ బ్రాండ్ పేరుతో కల్లు విక్రయం

మొత్తం 1,000 లీటర్లకు పైగా కల్లు జప్తు

అనుమతి లేకుండా అమ్మకాలు జరిపిన వారికి కేసులు

Show Full Article
Print Article
Next Story
More Stories