Hyderabad Hit and Run: బైక్‌ను ఢీకొట్టి 200 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు

Hyderabad Hit and Run: హైదరాబాద్ లోని మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 9 March 2026 5:22 PM IST
Hyderabad Hit and Run: బైక్‌ను ఢీకొట్టి 200 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు
X

Hyderabad Hit and Run: బైక్‌ను ఢీకొట్టి 200 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు

Hyderabad Hit and Run: హైదరాబాద్ లోని మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. బైక్ ను ఢీకొట్టిన కారు 200 మీటర్లు ఈడ్చుకెళ్లింది. వెంబడించి కారును పట్టుకున్న స్థానికులు డ్రైవర్ ను చితకబాది పోలీసులకు అప్పగించారు. అర్ధరాత్రి నలుగురు యువకులు షాద్ నగర్ నుంచి చార్మినార్ కు షాపింగ్ కు వెళ్తున్నారు.

ఈ క్రమంలో పల్లె చెరువు దగ్గర అతివేగంతో దూసుకొచ్చిన కారు బైక్ లను ఢీకొట్టింది. ఓ బైక్ కారు ముందు భాగంలో ఇరుకున్నప్పటికీ కారు ఆపకుండా అలాగే ఈడ్చుకెళ్లాడు డ్రైవర్. ఈ ఘటనపై మైలార్ దేవ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story