Hyderabad Old City Murder: వివాహేతర సంబంధంలో ప్రియుడు హత్య

Hyderabad Old City Murder: వివాహేతర సంబంధంలో ప్రియుడు హత్య
x

Hyderabad Old City Murder: వివాహేతర సంబంధంలో ప్రియుడు హత్య

Highlights

హైదరాబాద్ పాతబస్తీ మహారాజ్ గంజ్‌లో వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త కత్తితో దాడి చేయగా అమిత్ మృతి చెందాడు. భార్య పూజకు స్వల్ప గాయాలు అయ్యాయి.

హైదరాబాద్ పాతబస్తీలోని మహారాజ్ గంజ్ ప్రాంతంలో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్యతో పాటు ఆమె ప్రియుడిపై భర్త కత్తితో దాడి చేయగా, తీవ్ర గాయాలతో ఒకరు మృతి చెందారు.

పోలీసుల వివరాల ప్రకారం, మహారాజ్ గంజ్‌లో నివాసముంటున్న రవి, పూజ దంపతులు కొంతకాలంగా కుటుంబ కలహాలతో జీవిస్తున్నారు. రవి భార్య పూజకు హుస్సేని ఆలం ప్రాంతానికి చెందిన అమిత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న రవి, పూజను అమిత్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా రవి ఇద్దరినీ హెచ్చరించి, తమ ప్రవర్తన మార్చుకోవాలని సూచించినట్లు పోలీసులు తెలిపారు. అయితే పూజలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో, ఆగ్రహానికి గురైన రవి అమిత్, పూజపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అమిత్ తీవ్రంగా గాయపడగా, పూజకు స్వల్ప గాయాలు అయ్యాయి.

గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అమిత్ మృతి చెందాడు. పూజ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు రవిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన పాతబస్తీలో తీవ్ర కలకలం రేపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories