Hyderabad Out Side Food: హైదరాబాద్‌లో ఔట్ సైడ్ ఫుడ్ తింటే.. ఇక మీరు ఔటే.. పుడ్ సేప్టీ అధికారులు

Hyderabad Out Side Food
x

Hyderabad Out Side Food: హైదరాబాద్‌లో ఔట్ సైడ్ ఫుడ్ తింటే.. ఇక మీరు ఔటే.. పుడ్ సేప్టీ అధికారులు

Highlights

Hyderabad Out Side Food: కల్తీ..కల్తీ.. కల్తీ.. హైదరాబాద్‌లో బయట ఫుడ్ ఎక్కడ తిన్నా కల్తీయే. ఇది నేను చెబుతున్న మాట కాదు.. హైదరాబాద్‌లో ఇటీవల తనిఖీలు నిర్వహించి మన ఫుడ్ సేఫ్టీ అధికారులే ఈ మాటలు చెబుతున్నారు.

Hyderabad Out Side Food: కల్తీ..కల్తీ.. కల్తీ.. హైదరాబాద్‌లో బయట ఫుడ్ ఎక్కడ తిన్నా కల్తీయే. ఇది నేను చెబుతున్న మాట కాదు.. హైదరాబాద్‌లో ఇటీవల తనిఖీలు నిర్వహించి మన ఫుడ్ సేఫ్టీ అధికారులే ఈ మాటలు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

అక్రమంగా డబ్బులు సంపాదించుకునేందుకు చాలామంది ఇప్పుడు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. తినేదైనా..తాగేదైనా.. ఏదైనా ఇప్పుడు హైదరాబాద్‌లో కల్తీయే. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఫుడ్ సేప్టీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో మైండ్ బ్లాక్ విషయాలు బయటపడ్డాయి. హోటళ్లు, స్టాళ్లను చూసిన అధికారులకే మతిపోయింది.

తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎల్బీనగర్, మాల్కాజ్ గిరి, మహేశ్వరం, భువనగిరి ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేసారు. ఈ తనిఖీలో అధికారులే విస్తుపోయేలా అక్కడ ఆహార పదార్ధాలు ఉన్నాయి. వాటిని చూసి అధికారులు దిమ్మతిరిగిపోయింది. హైదరాబాద్ ప్రజల ఆరోగ్య పరిస్తితి ఏంటన్నది వారి ప్రశ్నార్ధకంగా మారిపోయింది.

అధికారులు జరిపిన తనిఖీలో ఎక్కడ చూసినా కల్తీయే కనిపించింది. ఈ కల్తీ పదార్దాలన్నింటినీ సీజ్ చేసారు. ఇందులో 575 కేజీల కల్తీ నెయ్యి, 3,946 కిలోల అల్లం పేస్ట్, 3,037 కిలోల అల్లంవెల్లుల్లి పేస్ట్, 250 కిలోల కల్తీ పన్నీర్‌‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పదార్ధాలకు నకిలీ బ్రాండ్లు ఉపయోగించి చిన్న చిన్న షాపులకు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. విచిత్రం ఏంటంటే ఇవి కల్తీ పదార్ధాలే అని దుకాణదారులకు తెలిసినా ఎక్కువ లాభాలు రావడంతో వాటిని పట్టించుకోకుండా కల్తీ పదార్ధాలనే వాడుతున్నారు.

ఇవే కాదు ఇంకా ఎన్నో కల్తీ ఆహార పదార్దాలను అధికారులు సీజ్ చేశారు. అల్లంవెల్లుల్లి పేస్ట్‌లో సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను కలుపుతున్నారు. అలానే టీపొడి, కారంపొడి, పసుపు, స్వీట్లు, ప్యాకెట్ ఆహార పదార్ధాలు, బేకరీ ఆహారపదార్దాలు, ఐస్ క్రీములు, మినరల్ వాటర్ సైతం అన్నింటిలోనూ కెమికల్స్ ను కలుపుతున్నారు.

అంతేకాదు ఇలాంటి ఆహార పదార్ధాలు అమ్ముతున్నవారికి ఎటువంటి ఫుడ్ లైసెన్సులు లేవు. పైగా నకిలీ బ్రాండ్లు, బాలకార్మికులను ఉపయోగించుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ తనిఖీలు తర్వాత 46 కేసులు పెట్టి, దాదాపు 52మందిని అరెస్ట్ చేశారు. ఇలాంటి తింటే సిటీ ప్రజలు ఆరోగ్యం పాడైపోతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయట ఆహారం తినడం ఆపేయాలని, అప్పుడే ఇలాంటి వాళ్లు పెరగకుండా ఉంటారని పుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories