Hyderabad Power Cut Alert Today: హైదరాబాద్‌లో నేడు పవర్ కట్... జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏరియాల్లో గంటల తరబడి చీకట్లే.. పూర్తి వివరాలివే!


Hyderabad Power Cut Alert Today: హైదరాబాద్‌లో నేడు పవర్ కట్... జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏరియాల్లో గంటల తరబడి చీకట్లే.. పూర్తి వివరాలివే!
Hyderabad Power Cut Alert Today: హైదరాబాద్ వాసులకు అలర్ట్! జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసరాల్లో నేడు (శనివారం) గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఏయే ప్రాంతాల్లో ఏ సమయంలో పవర్ కట్ ఉంటుందో పూర్తి షెడ్యూల్ ఇక్కడ చూడండి.
Hyderabad Power Cut Alert Today: నగరంలోని అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు విద్యుత్ శాఖ కీలక ప్రకటన చేసింది. విద్యుత్ లైన్ల నిర్వహణ పనులు, ఫీడర్ల మరమ్మతుల కారణంగా నేడు (శనివారం) పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు విడతల వారీగా ఈ కోతలు ఉండనున్నాయి.
విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు - సమయాలు:
ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు:
♦ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 31, 36, 41, 42, 43, 44 మరియు 44-ఏ.
♦ ప్లెజెంట్ వ్యాలీ మెయిన్ రోడ్, గాయత్రి హిల్స్ పోలీస్ లైన్ ఔట్ గేట్.
♦ యూసుఫ్‌గూడ సబ్ స్టేషన్ సమీప వీధులు, జయభేరి కమాన్ లైన్.
♦ మాతృశ్రీ హోటల్ లేన్, ఎం స్క్వేర్ హోటల్ లేన్.
♦ రామ్ చరణ్ నివాస ప్రాంతం, ఐఏఎస్ క్వార్టర్స్, దామోదర్ రెడ్డి నివాసం ఉన్న వీధులు.
మధ్యాహ్నం 11:30 నుండి 12:30 వరకు:
♦ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 25 నుండి 39 వరకు గల పలు ప్రాంతాలు.
మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 5:00 వరకు:
♦ మధ్యాహ్నం 2:00 - 3:00: ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ, సీఆర్పీఎఫ్ గేట్, చిరంజీవి తల్లి నివాసం ఉండే వీధి.
♦ మధ్యాహ్నం 2:00 - 5:00: గౌతమ్ మోడల్ స్కూల్ లేన్, వెంకటగిరి బస్తీ, వెంకటగిరి చర్చి లేన్.
♦ మాదాపూర్ రోడ్డు నంబర్ 2, 5, 7 ప్రాంతాలు.
అధికారుల సూచన: నిర్వహణ పనులు త్వరగా పూర్తయితే నిర్ణీత సమయం కంటే ముందే సరఫరాను పునరుద్ధరిస్తామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అయితే, ఈ ప్రాంతాల్లోని కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు మరియు గృహ వినియోగదారులు పవర్ కట్ సమయాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



