Hyderabad: టోలిచౌకిలో ఘోర ప్రమాదం.. ఐదో అంతస్తు నుంచి పడి ముగ్గురు కార్మికుల దుర్మరణం!

Hyderabad: టోలిచౌకిలో ఘోర ప్రమాదం.. ఐదో అంతస్తు నుంచి పడి ముగ్గురు కార్మికుల దుర్మరణం!
x

Hyderabad: టోలిచౌకిలో ఘోర ప్రమాదం.. ఐదో అంతస్తు నుంచి పడి ముగ్గురు కార్మికుల దుర్మరణం!

Highlights

Hyderabad: హైదరాబాద్‌ టోలిచౌకిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Hyderabad: హైదరాబాద్‌ టోలిచౌకిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అల్‌ హస్నాత్‌ కాలనీలో భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు ప్రమాదవశాత్తు కిందపడ్డారు. 5వ అంతస్తు నుంచి కిందపడటంతో అక్కడికక్కడే ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. వారిని స్థానికులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. భవన నిర్మాణ పనుల్లో భద్రతా చర్యలు పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories