Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. 60 రోజులపాటు ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు.. డైవర్షన్ రూట్లు ఇవే

Hyderabad Traffic Alert
x

Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. 60 రోజులపాటు ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు.. డైవర్షన్ రూట్లు ఇవే

Highlights

Hyderabad Traffic Alert: హైదరాబాద్‌లోని మలక్‌పేట - సైదాబాద్ మార్గంలో ప్రయాణించే వారికి అలర్ట్. ఎలివేటెడ్ కారిడార్ పనుల కోసం రేపటి (జనవరి 15) నుంచి 60 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. సైదాబాద్ వై జంక్షన్ నుంచి ధోబీఘాట్ వరకు రోడ్డు మూసివేత.

Hyderabad Traffic Alert: భాగ్యనగరంలోని మలక్‌పేట నుంచి యాదగిరి థియేటర్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. ఈ నేపథ్యంలో నల్గొండ ఎక్స్ రోడ్ - ఐఎస్ సదన్ మధ్య ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. గురువారం (జనవరి 15) నుంచి సుమారు రెండు నెలల పాటు (60 రోజులు) ఈ కింది మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు మరియు మళ్లింపులు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.

రోడ్డు మూసివేత వివరాలు: సైదాబాద్ వై జంక్షన్ నుంచి దోభీఘాట్ (ఐఎస్ సదన్ వైపు) వరకు ఒక వైపు రహదారిని పూర్తిగా మూసివేస్తారు. కాబట్టి ప్రజలు నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి ఒవైసీ హాస్పిటల్ (డీఎంఆర్ఎల్ జంక్షన్) మార్గాన్ని వీలైనంత వరకు నివారించాలని పోలీసులు కోరారు.

ప్రత్యామ్నాయ మార్గాలు (Diversion Points):

భారీ వాహనాలు & ఆర్టీసీ బస్సులు (సైదాబాద్ నుంచి ఐఎస్ సదన్ వైపు): నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి వచ్చే భారీ వాహనాలను సైదాబాద్ వై జంక్షన్ వద్ద మళ్లించి.. డీసీపీ ఆఫీస్ - సరస్వతి నగర్ - సంకేశ్వర్ బజార్ - సింగరేణి కాలనీ - ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ - చంపాపేట్ మెయిన్ రోడ్ మీదుగా ఐఎస్ సదన్ చేరుకోవాలి.

టూ వీలర్ & త్రీ వీలర్ వాహనాలు:

ఐఎస్ సదన్ వైపు: సైదాబాద్ వై జంక్షన్ వద్ద 105 బస్ స్టాప్ - రామాలయం కమాన్ - లక్ష్మీ నగర్ - బిస్కెట్ ఫ్యాక్టరీ - ధోబీఘాట్ జంక్షన్ మీదుగా వెళ్లాలి.

చంపాపేట్ వైపు: లక్ష్మీ నగర్ - వినయ్ నగర్ - భారత్ గార్డెన్ మీదుగా చంపాపేట్ మెయిన్ రోడ్డుకు వెళ్లాలి.

జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు: ఎంజీబీఎస్ మరియు చాదర్‌ఘాట్ నుంచి వచ్చే జిల్లా బస్సులు, భారీ వాహనాలను నల్గొండ ఎక్స్ రోడ్ వద్దే మలక్‌పేట్ - దిల్‌సుఖ్‌నగర్ - ఎల్బీ నగర్ మీదుగా మళ్లిస్తారు.

నగర ఆర్టీసీ బస్సులు: చాదర్‌ఘాట్ నుంచి వచ్చే బస్సులను నల్గొండ ఎక్స్ రోడ్ వద్ద మలక్‌పేట్ గంజ్ - మూసారాంబాగ్‌ - గడ్డిఅన్నారం యూ టర్న్ - శివగంగ థియేటర్ - సరూర్‌నగర్ చెరువు - సింగరేణి కాలనీ మీదుగా చంపాపేట్ చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

పోలీసుల విజ్ఞప్తి: ఈ పనుల వల్ల ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, వాహనదారులు పోలీసులకు సహకరించి సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ విభాగం కోరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories