KBR Park traffic diversions: కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ మళ్లింపులు.. కొత్త మార్గాలు ఇవే

KBR Park traffic diversions
x

 KBR Park traffic diversions: కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ మళ్లింపులు.. కొత్త మార్గాలు ఇవే

Highlights

KBR Park traffic diversions: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణాలతో ట్రాఫిక్ మళ్లింపులు అమలు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కొత్త మార్గాలు ప్రకటించిన పోలీసులు.

హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి వచ్చాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాసుల నిర్మాణ పనులు ప్రారంభమవడంతో ఇవాళ్టి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

నిర్మాణ పనుల కారణంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ (గేట్-1), ముగ్ధ జంక్షన్, బంజారాహిల్స్ రోడ్ నెం.1 ప్రాంతాల్లో వాహన రాకపోకలకు మళ్లింపులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే వాహనదారులకు పలు సూచనలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రధాన మళ్లింపులు ఇవి:

బంజారాహిల్స్ రోడ్ నెం.1 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్లే వాహనాలు రోడ్ నెం.10, క్యాన్సర్ హాస్పిటల్, అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యా భవన్ మార్గం ద్వారా ప్రయాణించాలి.

మాసాబ్ ట్యాంక్ నుంచి కేబీఆర్ పార్క్ – జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వారు విరించి హాస్పిటల్, రోడ్ నెం.12 జంక్షన్ వద్ద ఎడమవైపు తిరిగి అగ్రసేన్ ఐలాండ్ మార్గాన్ని ఉపయోగించాలి.

ఎన్‌ఎఫ్‌సీఎల్ నుంచి శ్రీనగర్ కాలనీ, సాగర్ సొసైటీ, ఇందిరానగర్, లేబర్ అడ్డా మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌కు వెళ్లేలా మార్గం సూచించారు.

జూబ్లీహిల్స్ రోడ్ నెం.36/45 నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్ వైపు వెళ్లే వాహనాలు ఇందిరానగర్, శ్రీరామ్ నగర్ కాలనీ మార్గాన్ని ఉపయోగించాలి.

నిర్మాణ పనుల సమయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికతో ఈ మార్పులు అమలు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు సూచించిన మార్గాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories