Hyderabad Water Supply Update: హైదరాబాద్‌కు 'గోదావరి' జలాలు.. రూ. 7,360 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. జలమండలి కీలక అప్‌డేట్!

Hyderabad Water Supply Update
x

Hyderabad Water Supply Update: హైదరాబాద్‌కు 'గోదావరి' జలాలు.. రూ. 7,360 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. జలమండలి కీలక అప్‌డేట్!

Highlights

Hyderabad Water Supply Update: హైదరాబాద్ వాసులకు తాగునీటి కష్టాలు తీరనున్నాయి. రూ. 7,360 కోట్ల వ్యయంతో చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్-2, 3 పనులను డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని జలమండలి నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అదనంగా 20 టీఎంసీల నీరు నగరానికి అందనుంది.

Hyderabad Water Supply Update: భాగ్యనగర వాసుల తాగునీటి అవసరాలను శాశ్వతంగా తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం మరియు జలమండలి (HMWS&SB) కసరత్తు వేగవంతం చేశాయి. గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్-2 మరియు ఫేజ్-3 ప్రాజెక్టు పనులపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ మెగా ప్రాజెక్టును డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేసి నగర ప్రజల దాహార్తిని తీర్చాలని అధికారులను ఆదేశించారు.

ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు:

మొత్తం వ్యయం: రూ. 7,360 కోట్లు.

నీటి సామర్థ్యం: మల్లన్న సాగర్ నుంచి అదనంగా 20 టీఎంసీల నీటిని నగరానికి తరలించనున్నారు.

వినియోగం: ఇందులో 17.5 టీఎంసీలు ప్రజల తాగునీటి అవసరాలకు, మిగిలిన 2.5 టీఎంసీలు మూసీ పునరుజ్జీవనం మరియు జంట జలాశయాల (ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్) కోసం ఉపయోగిస్తారు.

యుద్ధ ప్రాతిపదికన పనులు: ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ నుంచి ఘన్ పూర్ వరకు, అక్కడి నుంచి ఉస్మాన్ సాగర్ వరకు పైప్ లైన్ విస్తరణ పనులను వేగవంతం చేయాలన్నారు.

మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్: ఘన్ పూర్ వద్ద 80 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం.

నీటి శుద్ధి కేంద్రాలు (WTP): ఘన్ పూర్, శామీర్ పేట్ వద్ద 1170 ఎంఎల్డీల సామర్థ్యంతో భారీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు.

భారీ పైప్ లైన్: 3000 ఎంఎం డయా కలిగిన అతిపెద్ద పైప్ లైన్ ద్వారా నీటి తరలింపు.

నగరానికి రెట్టింపు మేలు: ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి ఫేజ్-1 ద్వారా 10 టీఎంసీల నీరు అందుతోంది. కొత్త ప్రాజెక్టు పూర్తయితే అదనంగా మరో 300 ఎంజీడీల (MGD) నీరు సరఫరా అవుతుంది. దీనివల్ల హైదరాబాద్‌కు రాబోయే 30 ఏళ్ల వరకు తాగునీటి ఢోకా ఉండదని అధికారులు భావిస్తున్నారు. తాగునీటితో పాటు మూసీ ప్రక్షాళనకు కూడా ఈ నీరు ప్రాణాధారంగా మారనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories