Hyderabad: బంజారాహిల్స్‌లో కుంగిన రోడ్డులో ట్యాంకర్ కూరుకుపోయింది..! వీడియో వైరల్

Hyderabad: బంజారాహిల్స్‌లో కుంగిన రోడ్డులో ట్యాంకర్ కూరుకుపోయింది..! వీడియో వైరల్
x
Highlights

Hyderabad: గత రాత్రి నగరంలో కురిసిన భారీ వర్షం నగర వాసులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. బంజారాహిల్స్ ప్రాంతంలో ఓ ప్రధాన రహదారి అకస్మాత్తుగా కుంగిపోవడంతో ఓ నీటి ట్యాంకర్ అందులో కూరుకుపోయిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు.

దీంతో అక్కడి వాసులు, ప్రత్యక్ష సాక్షులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని బయటకు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

కుంగిన రోడ్డు కారణంగా అక్కడ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ట్యాంకర్‌ను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. క్రేన్ సహాయంతో ట్యాంకర్‌ను వెలికి తీసే పనులు జరుగుతున్నాయి.

గాయపడిన డ్రైవర్, క్లీనర్‌ను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.

వీడియో వైరల్

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డులో ఏర్పడ్డ పెద్ద గుంత, అందులో ట్యాంకర్ పూర్తిగా కూరుకుపోయిన దృశ్యాలు ప్రజల్లో భయాందోళనకు కారణమయ్యాయి. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ అధికారులు విచారణ చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories