Nikitha Godishala: అమెరికాలో హైదరాబాద్‌కి చెందిన యువతి దారుణ హత్య

Nikitha Godishala: అమెరికాలో హైదరాబాద్‌కి చెందిన యువతి దారుణ హత్య
x

Nikitha Godishala: అమెరికాలో హైదరాబాద్‌కి చెందిన యువతి దారుణ హత్య

Highlights

Nikitha Godishala: అమెరికాలో హైదరాబాద్‌కి చెందిన యువతి దారుణ హత్యకు గురైంది.

Nikitha Godishala: అమెరికాలో హైదరాబాద్‌కి చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. డిసెంబర్‌ 31న కనిపించకుండాపోయిన నిఖిత అనే యువతి.. మేరీల్యాండ్‌ ఎలికాట్‌ సిటీలో హత్యకు గురికావడం కలకలం రేపింది. మాజీ ప్రియుడు అర్జున్‌ శర్మ నివాసంలో నిఖిత మృతదేహం లభ్యం కాగా.. ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

జనవరి 2న నిఖిత అదృశ్యంపై అర్జున్‌ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే రోజు అర్జున్‌ శర్మ ఇండియాకు తిరుగు ప్రయాణం అవడంతో.. పోలీసులు అతడిని అనుమానితుడిగా గుర్తించి దర్యాప్తు ముమ్మరం చేశారు. అర్జున్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసి.. తమిళనాడులో అతడిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. అతడిని అమెరికాకు అప్పగించేందుకు అధికారిక ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories