Khammam: పోలీసులకు ఆదర్శ వివాహం

Khammam: పోలీసులకు ఆదర్శ వివాహం
x
Highlights

Khammam: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామంలో పోలీసులకు ఆదర్శ వివాహం ఘనంగా నిర్వహించారు.

Khammam: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామంలో పోలీసులకు ఆదర్శ వివాహం ఘనంగా నిర్వహించారు. బీరవల్లి ప్రశాంత్, నాగజ్యోతిలకు పత్తిపాటి వెంకటేశ్వరరావు, డా. కొచ్చర్ల శ్రీనివాసరావు, అడ్వొకేట్ మీసాల రామచంద్ర రావు రాజ్యాంగంపై ప్రమాణంచేయించి వివాహతంతును నిర్వహించారు. అంబేద్కర్ ఫోటో కి పూలదండ వేయించి మతాలకు, సాంప్రదాయాలకు అతీతంగా వధూవరులకు దండలు మార్పించి నిరాడంబరంగా స్టేజ్ వివాహం జరిపించారు.

వధూవరులు ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందినవారు వరుడు బీరవల్లి ప్రశాంత్ జార్ఖండ్ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తుండగా, వధువు నాగజ్యోతి విజయవాడలో విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ ఆదర్శ వివాహానికి సిద్ధపడటం అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆదర్శ వివాహం చేసుకున్న బీరవల్లి ప్రశాంత్, నాగజ్యోతిల బంధుమిత్రులు, గ్రామస్తులు ఆశీర్వదించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories