రేగాకు భద్రాచలం లక్ష్యమా? బీఆర్ఎస్ టికెట్ ఆశావాహుల్లో ఆగ్రహం

రేగాకు భద్రాచలం లక్ష్యమా? బీఆర్ఎస్ టికెట్ ఆశావాహుల్లో ఆగ్రహం
x

రేగాకు భద్రాచలం లక్ష్యమా? బీఆర్ఎస్ టికెట్ ఆశావాహుల్లో ఆగ్రహం

Highlights

10 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయన్న ప్రచారం భద్రాచలం నియోజకవర్గంపై ఫోకస్ పెట్టిన రేగా భద్రాచలం కేంద్రంగా రేగా కాంతారావు రాజకీయాలు రేగా రేసులో ఉంటే.. మా సంగతేంటని ఆశావహుల ప్రశ్న

భద్రాచలం నియోజకవర్గంపై ఆ జిల్లా బీఆర్ఎస్‌ అధ్యక్షుడు కన్నేసాడా..? భద్రాచలంలో "పాగా"కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడా..? ఉప ఎన్నికకు ముందే పకడ్బందీ కార్యాచరణకు శ్రీకారం చుట్టాడా..? రహదారుల పోరు వెనుక పొలిటికల్ స్కెచ్ అందుకేనా..?

సోషల్ మీడియా వేదికగా ఆ నేత రిలీజ్ చేస్తున్న పోస్ట్‌లు ఎమ్మెల్యే రేసులో ఉన్నానంటూ సంకేతాలా..? ఆయన రేసులో ఉంటే.. ఇంతకాలం పార్టీని నమ్ముకున్నోళ్లంతా నట్టేట మునిగినట్లేనా..? భద్రాచలం నియోజకవర్గం గులాబీ దళంలో ఏం జరుగుతోంది..?


భద్రాచలంలో బీఆర్ఎస్‌ టికెట్‌పై గెలిచిన తెల్లం

కాంగ్రెస్ గూటికి చేరడంతో ఉప ఎన్నికకు ఛాన్స్

తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కీలక దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఉప ఎన్నికలు అనివార్యం కానున్నాయన్న టాక్ జోరందుకుంది. ఈ క్రమంలో ఎక్కడైతే ఉప ఎన్నికలు జరుగుతాయో అక్కడ పోటీ చేసేందుకు ఆశావాహులు ఇప్పటికే పావులు కదుపుతున్నారు. బిఆర్ఎస్ నుంచి గెలిచి అధికార పార్టీలోకి దూకిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ ఎత్తుగడలు మొదలయ్యాయి. టిక్కెట్ కోసం పోటీలు పెరిగాయి. ఫిరాయింపు స్థానాల్లో కొత్తవారికి అవకాశాలు వచ్చే పరిస్థితి ఉండటంతో పలువురు టికెట్ల కోసం పావులు కదుపుతూ వస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కీలక ఘట్టానికి చేరడంతో జరగబోయే ఉప ఎన్నికలకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పొలిటికల్ స్టంట్‌కు ఊతమిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రాపు.. కాంగ్రెస్ గూటికి చేరడంతోభద్రాచలం నియోజకవర్గంలోనూ ఉప ఎన్ని‎క జరగనుంది. ఈ క్రమంలో ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై అభ్యర్థి పేరు ఎప్పటి నుంచో వినిపిస్తోంది. తాజాగా ఆ అభ్యర్థి వేస్తున్న అడుగులు పాలిటికల్ ఎజెండా మేరకేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భద్రాచలం నియోజకవర్గంపై రేగ కన్నుపడినట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. దీంతో ఎన్నో ఏళ్లుగా పార్టీ కార్యాచరణలో పాల్గొంటూ ప్రజలకు దగ్గరగా ఉంటూ వస్తున్న ఒకరిద్దరు ఆశావాహులు.. అదెలా సాధ్యమంటూ ప్రశ్నిస్తున్నారట. ఇన్నాళ్లూ పార్టీనే నమ్ముకుని.. ఎమ్మెల్యే పదవిపై గంపెడాశలు పెట్టకున్న తమను కాదని నాన్‌లోకల్‌కు టికెట్ ఎలా ఇస్తారని సవాల్ చేస్తున్నారట. అయితే ఇసుక లారీల కారణంగా ధ్వంసమవుతున్న రహదారుల సమస్యపై కొంతకాలంగా రేగా కాంతారావు ఉద్యమ బాట పట్టారు. ఇసుక లారీలను నియంత్రించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే.. తాను భద్రాచలం నియోజకవర్గం నుంచి పాల్గొంటానని సోషల్ మీడియా కేంద్రంగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. లారీలు నిలుపుదల చేసే కార్యక్రమంలో భాగంగా రేగా భద్రాచలం ఎంచుకోవడం ఒక రాజకీయ ఎజెండాగానే భావిస్తున్నారు పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్. కాంతారావు భద్రాచలం కేంద్రంగా కార్యచరణకు శ్రీకారం చుట్టడంతో రాజకీయంగా చర్చలకు ఆస్కారం ఏర్పడింది. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్టాన నిర్ణయం ఎలా ఉండనుందో కానీ రేగా కాంతారావు పోటీ చేస్తున్నారన్న విషయం బహిరంగ చర్చకు దారి తీసింధి.


ఉప ఎన్నిక వస్తే భద్రాచలం బరిలో రేగా ఉంటారన్న పుకార్లు

ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న బుచ్చయ్య, రామకృష్ణ..

నాన్ లోకల్స్‌కు టికెట్ ఇస్తే పార్టీ నష్టపోతుందన్న వాదన

ఉప ఎన్నిక అనివార్యమైతే భద్రాచలం నుంచి రేగా బరిలో ఉంటారన్న పుకార్లు వస్తుండటంతో.. ఇప్పటివరకు పార్టీని అంటిపెట్టుకొని ఉన్న నేతల్లో అసంతృప్తి నెలకొందట. ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూ భంగపడుతూ వస్తున్న బోదెబోయిన బుచ్చయ్య, మానే రామకృష్ణ లాంటి నేతలు తమ భవిష్యత్తుపై ఆశలు వదులుకోవాల్సిందేనా..? అన్న చర్చ కూడా జోరందుకుంది. స్థానికులను కాదని నాన్ లోకల్‌ అభ్యర్థులకు టికెట్ కేటాయిస్తే పార్టీకి నష్టం తప్పదన్న వాదన బలంగా వినిపిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే టికెట్ ఆశావహులు..

Show Full Article
Print Article
Next Story
More Stories