Jagadish Reddy: పీక్ డిమాండ్ వేళల్లో 20శాతం చార్జీలు పెంచడమంటే.. పేదలను విద్యుత్‌కు దూరం చేయడమే

Jagadish Reddy Comments On Electricity Subsidies
x

Jagadish Reddy: పీక్ డిమాండ్ వేళల్లో 20శాతం చార్జీలు పెంచడమంటే.. పేదలను విద్యుత్‌కు దూరం చేయడమే

Highlights

Jagadish Reddy: పేద ప్రజలకు విద్యుత్‌ సబ్సిడీలు ఎత్తేసే కుట్ర జరుగుతుంది

Jagadish Reddy: పీక్ డిమాండ్ వేళల్లో 20 శాతం చార్జీలు పెంచడమంటే పేదలను విద్యుత్‌కు దూరం చేయడమేనని అన్నారు మంత్రి జగదీశ్‌ రెడ్డి. విద్యుత్‌ గరిష్ట డిమాండ్‌ వేళల్లో వాడిన కరెంటుకు 20 శాతం చార్జీలు పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి ఆర్థిక ద్రోహానికి పాల్పడటమేనని మండిపడ్డారు. చార్జీలు పెంచడం ద్వారా సామాన్యుడిని విద్యుత్ వినియోగం నుండి దూరం చెయ్యడమేనని కేంద్రంపై నిప్పులు చెరిగారు. పేద ప్రజలకు సబ్సిడీలు ఎత్తేసే కుట్ర జరుగుతుందని, గతంలోనూ తెలంగాణ విద్యుత్‌పై కుట్రలు చేసి రుణాలు రాకుండా అడ్డుకున్నారని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories