Jagitial Municipal Chairperson: జగిత్యాల మున్సిపల్ ‘బాస్’ ఎవరో తేలిపోయింది: చైర్‌పర్సన్‌గా సమిండ్ల వాణి.. పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే సంజయ్!

Jagitial Municipal Chairperson: జగిత్యాల మున్సిపల్ ‘బాస్’ ఎవరో తేలిపోయింది: చైర్‌పర్సన్‌గా సమిండ్ల వాణి.. పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే సంజయ్!
x
Highlights

Jagitial Municipal Chairperson: గత కొద్దిరోజులుగా జగిత్యాల మున్సిపాలిటీపై నెలకొన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది.

Jagitial Municipal Chairperson: గత కొద్దిరోజులుగా జగిత్యాల మున్సిపాలిటీపై నెలకొన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరియు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గాల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో, కాంగ్రెస్ అధిష్ఠానం మధ్యేమార్గంగా ఒక నిర్ణయానికి వచ్చింది. రెండు వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించింది.

ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే చైర్మన్ పీఠం:

జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిని ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి కేటాయించారు. ఆయన ప్రతిపాదించిన సమిండ్ల వాణిని మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎంపిక చేస్తూ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో సంజయ్ వర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

జీవన్ రెడ్డి వర్గానికి వైస్ చైర్మన్ పదవి:

మున్సిపాలిటీపై పట్టు కోసం ప్రయత్నించిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గానికి వైస్ చైర్మన్ పదవిని కేటాయించారు. ఈ మేరకు వైస్ చైర్మన్ పదవికి పర్వీన్‌ను ఎన్నుకున్నారు. పార్టీ గెలుపు కోసం తమ వర్గం కూడా తీవ్రంగా శ్రమించిందని జీవన్ రెడ్డి అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అధిష్ఠానం బుజ్జగింపులు:

కేవలం వైస్ చైర్మన్ పదవితో సరిపెట్టకుండా, భవిష్యత్తులో రాబోయే జెడ్పీ (ZP) మరియు మార్కెట్ కమిటీ పదవులను కూడా జీవన్ రెడ్డి వర్గానికే కేటాయిస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ హామీతో ఇరువర్గాలు ప్రస్తుతానికి శాంతించాయి. ఇద్దరు అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరుకు చెక్ పెడుతూ, అందరినీ కలుపుకుని పోయేలా కాంగ్రెస్ పెద్దలు ఈ సమతుల్యతను పాటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories