తెలంగాణ డీజీపీగా జితేందర్ నియామకం

Jitender appointed as Telangana DGP
x

తెలంగాణ డీజీపీగా జితేందర్ నియామకం

Highlights

14 నెలల పాటు డీజీపీగా జితేందర్‌ కొనసాగే అవకాశం

తెలంగాణ డీజీపీగా జితేందర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన డీజీపీగా ఉత్తర్వులు వెలువడిన వెంటనే సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డిని నూతన డీజీపీ కలిశారు.

1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి జితేందర్. ఆయన స్వంత రాష్ట్రం పంజాబ్. ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన జితేందర్ తొలుత నిర్మల్ ఏఎస్పీగా పనిచేశారు. అనంతరం బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహించారు.మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా కూడా ఆయన పనిచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories