Jubilee Hills bypoll: జూబ్లీ బైపోల్‌ కోసం కారు వ్యూహాత్మక అడుగులు

Jubilee Hills bypoll: జూబ్లీ బైపోల్‌ కోసం కారు వ్యూహాత్మక అడుగులు
x

Jubilee Hills bypoll: జూబ్లీ బైపోల్‌ కోసం కారు వ్యూహాత్మక అడుగులు

Highlights

జూబ్లీ బైపోల్‌ కోసం కారు వ్యూహాత్మక అడుగులు నంది నగర్‌లో వార్ రూమ్‌ ఏర్పాటు ఎన్నికల ప్రచార వ్యూహాలను అక్కడి నుంచే అమలు డివిజన్‌కు ఒక ఇంచార్జ్‌, బూతుల వారిగా మరో 55 మంది ప్రతి గడపను, ప్రతి ఓటర్‌ను 3సార్లు కలిసేలా ప్రణాళిక లోకల్ లీడర్లను కలుపుకొని వెళ్లేలా ప్రణాళిక

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బిఅరెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్‌లో గెలవాలని బీఅరెస్ వార్ రూమ్ నుంచి నేతలకు, ఇన్ఛార్జీలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. వార్ రూమ్ నుంచి ఎవరెవరు మానిటరింగ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్న ఇన్ఛార్జీలకు ఇచ్చిన టాస్క్ ఏంటి..? జూబ్లీహిల్స్‌లో కారు ప్రచార వ్యూహంపై.. ప్రత్యేక కథనం


జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నంది నగర్‌లోని కేసీఆర్‌ నివాసంలో వార్ రూమ్‌ను ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచార వ్యూహాలను అక్కడి నుంచే అమలు చేస్తూ ఇన్చార్జిలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఒక్కో డివిజన్‌కు ఒక ఇన్చార్జిని ఇప్పటికే నియమించిన పార్టీ.. మరో 55 మంది ఇన్చార్జిలను బూతుల వారిగా నియమించింది.


55 మంది ఇన్చార్జిలతో పాటు వివిధ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు సైతం తరలివచ్చి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. లోకల్ లీడర్లను కలుపుకొని వెళ్లి ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేశారు. లోకల్ లీడర్లను కలుపుకొని వెళ్లకపోతే ఓటర్లకు, లీడర్లకు మధ్య గ్యాప్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి స్థానిక కేడర్‌కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ వాళ్లతో ప్రచారం చేసేలా షెడ్యూల్ ని ఖరారు చేశారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలను కలిసేలా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా.. బస్తీలపై ఎక్కువ దృష్టి పెట్టేలా వ్యూహ రచన చేస్తున్నారు.


మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే ఫార్ములాను అమలు చేసిందో అదే ఫార్ములాను జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అమలు చేయాలని డిసైడ్ అయింది గులాబీ అధిష్టానం. అందులో భాగంగానే నందినగర్‌లో ఏర్పాటు చేసిన వార్ రూమ్ లో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ సీనియర్ నేతలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ,మహమ్మద్ అలీ, పద్మారావు గౌడ్ వార్ రూమ్ ఇన్ఛార్జీలుగా ఉన్నారు.

ఎప్పటికప్పుడు జూబ్లీహిల్స్‌లో ప్రచార సరళిని, జనాల నాడీని విశ్లేషిస్తూ వ్యూహాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా..కార్యాచరణ రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి గడపకి కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు సంబంధించిన బాకీ కార్డ్ లను పంపిణీ చేస్తున్నారు బిఆర్ఎస్ నేతలు. గతంలో బీఆర్ఎస్ చేసిన పనులకు.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనకు తేడా చూపుతూ ప్రజల మద్దతు కూడగట్టాలని చూస్తోంది.


వార్ రూమ్ లోకి ఎవరికీ అనుమతి ఇవ్వకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తూ వాటిని అమలు చేసే విధంగా ఇన్చార్జిలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుంది వార్ రూమ్. హైదరాబాద్ నగరంలో బుల్డోజర్ ఇండ్లలోకి రావాలి అంటే కాంగ్రెస్ కి ఓటు వేయాలి అంటూ ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిఆర్ఎస్ ఇన్చార్జిలకు దిశా నిర్దేశం చేసింది. దీంతో అధిష్టానం సూచన మేరకు క్షేత్రస్థాయిలో కేడర్ సైతం ఇదే అంశాన్ని ఫాలో అవుతూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి మల్లారెడ్డి వినూత్నం రీతిలో ప్రచారం ప్రారంభించారు.


బుధవారం రోజు బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేసిన తర్వాత పార్టీ మరింత దూకుడుగా ప్రచారం చేయనుంది. ఎన్నికల ప్రచారం ముగిసే నాటికి ప్రతి గడపను, ప్రతి ఓటర్‌ను మూడుసార్లు అయినా టచ్ చేసే విధంగా ప్రచారం నిర్వహించాలని ఇన్చార్జిలకు సూచించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీకి అన్ని స్థానాలను ప్రజలు కట్టబెట్టారని అదే విధంగా ఈ ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌కే ప్రజలు పట్టం కట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దొడ్డిదారిన గెలిచేందుకు.. కాంగ్రెస్ ఓట్ చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజలకు ఈ విషయాలన్నీ వివరించాలని గులాబీ శ్రేణులకు సూచించారు. మరి వార్ రూమ్ నుంచి ఇంకా ఎలాంటి సూచనలు చేయనుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories