క‌విత తీరుపై కేసీఆర్ గుర్రుగా ఉన్నారా.? తాజా ప‌రిణామాలే ఇందుకు నిద‌ర్శ‌న‌మా.?

Kalvakuntla Kavitha KCR Meeting Political Developments
x

క‌విత తీరుపై కేసీఆర్ గుర్రుగా ఉన్నారా.? తాజా ప‌రిణామాలే ఇందుకు నిద‌ర్శ‌న‌మా.?

Highlights

KCR: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది.

KCR: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బుధవారం కవిత, తన భర్త అనిల్‌కుమార్‌తో కలిసి తండ్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను కలవడానికి ఎర్రవల్లిలోని నివాసానికి వెళ్లారు. అయితే, ఈ భేటీకి సంబంధించిన పరిణామాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి.

కవిత అక్కడికి చేరుకున్నప్పటికీ, అప్పటికే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్‌ విచారణకు హాజరయ్యేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. దాంతో ఇద్దరి మధ్య ప్రత్యేకంగా ఎలాంటి సంభాషణ జరగలేదు. ఈలోగా మరో ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికు ప్రమాదం జరగడంతో, అక్కడున్న బీఆర్‌ఎస్ నేతలంతా ఆసుపత్రికి వెళ్లారు. గాయపడిన పల్లాను వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.

అంతలో కేసీఆర్ బయటకు వచ్చి, అక్కడే ఉన్న కుమార్తె కవితను పలకరించకుండానే నేరుగా వాహనంలో ఎక్కి బీఆర్‌కే భవన్‌కు బయలుదేరినట్టు సమాచారం. ఈ పరిణామం ప్రస్తుతం పార్టీ శ్రేణుల్లో, రాజకీయ వర్గాల్లో నూతన చర్చలకు తావిచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories