Kalvakuntla Kavitha: త్వరలో కొత్త రాజకీయ పార్టీ.. తిరుమల వేదికగా కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన!

Kalvakuntla Kavitha: త్వరలో కొత్త రాజకీయ పార్టీ.. తిరుమల వేదికగా కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన!
x
Highlights

Kalvakuntla Kavitha: తప్పుడు కేసు పెట్టి తనను నాలుగేళ్లుగా వేధింపులకు గురిచేశారన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.

Kalvakuntla Kavitha: తప్పుడు కేసు పెట్టి తనను నాలుగేళ్లుగా వేధింపులకు గురిచేశారన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. కానీ సత్యం తన వైపు ఉండటంతో దేవుడి దయతో ఆ కేసును కోర్టు డిశ్చార్జ్ చేసిందన్నారు. తమకు వేంకటేశ్వర స్వామి అంటే మాకు ఎంతో నమ్మకమని..కేసులో క్లీన్ చిట్ వచ్చిన సందర్భంగా మొక్కు తీర్చుకోవడానికి తిరుమలకు వచ్చామని తెలిపారు. త్వరలో ఏర్పాటు చేయబోయే పొలిటికల్ పార్టీకి స్వామి వారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నానన్నారు కవిత.

కాగా ఇవాళ ఉదయంశంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కవిత తన కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి తిరుపతికి బయల్దేరారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకొని శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories