Kavitha: నాన్న.. రామన్న.. జాగ్రత్త

Kavitha: నాన్న.. రామన్న.. జాగ్రత్త
x
Highlights

Kavitha: హరీష్ రావు, సంతోష్ రావుపై కవిత సంచలన ఆరోపణలు చేశారు. వీరిద్దరు బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారని అన్నారు.

Kavitha: హరీష్ రావు, సంతోష్ రావుపై కవిత సంచలన ఆరోపణలు చేశారు. వీరిద్దరు బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్, హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణించారని.. రేవంత్ కాళ్లు హరీష్ రావు పట్టుకున్నాకే ఈ కట్రలు మొదలయ్యాయన్నారు. కేసీఆర్ ను మాత్రమే టార్గెట్ చేస్తారు. కేసీఆ్రర్ పై సీబీఐ విచారణ వచ్చిందంటే అందుకు కారణం హరీష్ రావు, సంతోష్ అని కవిత ఆరోపించారు.

హరీష్‌రావు, సంతోష్‌ టార్గెట్‌గా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కల్వకుంట్ల కవిత. హరీష్‌రావు, సంతోష్‌ తనపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌ వేదికగా తనపై కుట్ర జరుగుతుంటే.. అన్నగా కేటీఆర్‌ ఏం చేశారని నిలదీశారు. హరీష్‌, రేవంత్‌ ఒకే ఫ్లైట్‌లో ప్రయాణించిన తర్వాత నుంచే తనపై కుట్ర జరుగుతోందని హాట్‌ కామెంట్స్‌ చేశారు. మా కుటుంబాన్ని విచ్చిన్నం చేయాలని కుట్ర జరుగుతోందన్నారు. రేవంత్‌, హరీష్‌ కుమ్మక్కై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్‌పై సీబీఐ విచారణ వచ్చిందంటే అది హరీష్‌రావు వల్లే అంటూ ఫైర్ అయ్యారు. హరీష్‌, సంతోష్‌ ఇంట్లో బంగారంతో బంగారు తెలంగాణ సాధ్యమా..? అంటూ ప్రశ్నించారు. హరీష్‌రావు ట్రబుల్‌ షూటర్‌ కాదని, ట్రబుల్‌ మేకర్ అని, రేపు ఇదే ప్రమాదం నాన్న, రామన్నకు కూడా పొంచి ఉందని అన్నారు కవిత.

నాపై కుట్రలు జరుగుతుంటే చెల్లిగా.. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ఏం చేశారని కవిత ప్రశ్నించారు. ఒక చెల్లిని, మహిళా ఎమ్మెల్సీని, నాపై కుట్రలు జరుగుతున్నాయని గతంలోనే తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పానని తెలిపారు. మామూలు మహిళ కార్యకర్తకు పార్టీలో అన్యాయం జరిగితే స్పందిస్తారా.. నాకైతే అనుమానే అని కవిత అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. తాను ఏ పార్టీలో చేరనని. జాగృతి కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడిన తర్వాతే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కవిత స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories