కిష్టరాయినిపల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన కవిత ..బాధితులకు వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్

కిష్టరాయినిపల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన కవిత ..బాధితులకు వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్
x

కిష్టరాయినిపల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన కవిత ..బాధితులకు వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్

Highlights

నల్గొండ జిల్లా కిష్టరాయినిపల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన కవిత కిష్టరాయినపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్వాసితులతో సమావేశమై.. వారి సమస్యలు విని భరోసా ఇచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

నల్గొండ జిల్లా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలోని మునుగోడు నియోజకవర్గం కిష్టరాయినిపల్లి రిజర్వాయర్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సందర్శించారు. కిష్టరాయినిపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్లను సందర్శించారు. కిష్టరాయినిపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్వాసితులతో సమావేశమై వారి సమస్యలు విని వారికి భరోసా ఇచ్చారు. 2015లో పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ 11 ఏళ్లు ఆలస్యం కావడంతో సమస్యలు పెరిగాయన్నారు. మునుగోడు ఎన్నికల సమయంలో జగదీష్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి సహా చాలామంది నేతలు ఎకరాకు 25 లక్షల రూపాయలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు పట్టించుకోవడం లేదని అన్నారు. ఎమ్మెల్యేలు జగదీష్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి ఈ విషయంపై అసెంబ్లీలో మాట్లాడాలని డిమాండ్ చేశారు. బాధితులకు వెంటనే పరిహారం ఇవ్వాలని కోరారు.. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories