KCR: స్థానిక ఎన్నికల వేళ కేసీఆర్ కార్యకర్తల్లో భరోసా నింపారా..?

KCR: స్థానిక ఎన్నికల వేళ కేసీఆర్ కార్యకర్తల్లో భరోసా నింపారా..?
x

KCR: స్థానిక ఎన్నికల వేళ కేసీఆర్ కార్యకర్తల్లో భరోసా నింపారా..?

Highlights

KCR: స్థానిక ఎన్నికల వేళ కేసీఆర్ కార్యకర్తల్లో భరోసా నింపరా..?మళ్ళీ వచ్చేది బీఆర్‌ఎసే అనడం వెనుకున్న అంతర్యం ఏంటి..?

KCR: స్థానిక ఎన్నికల వేళ కేసీఆర్ కార్యకర్తల్లో భరోసా నింపరా..?మళ్ళీ వచ్చేది బీఆర్‌ఎసే అనడం వెనుకున్న అంతర్యం ఏంటి..? లోకల్‌ వార్‌లో కారు పార్టీకి కలిసొచ్చే అంశాలు ఏంటి...? కేసీఆర్ మాటల వెనుకున్న ధీమా ఏంటి .?

ప్రతిపక్షంలో బీఆర్‌ఎస్‌కి రెండేళ్లు అవుతుంది. బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన తరువాత కేసీఆర్ పెద్దగా ప్రజల్లోకి రాలేదు. కార్యకర్తలు కూడా కేసీఆర్ ఎప్పుడు ప్రజల్లోకి వస్తారని అడుగుతున్న సందర్భంలో... సందర్భాన్ని బట్టి కేసీఆర్ బయటికి వస్తారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. రీసెంట్ గా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తారని కేడర్ భావించినా గులాబీ బాస్ దూరంగానే ఉన్నారు. కనీసం జూబ్లీహిల్స్ అభ్యర్థికి మద్దతుగా ఒక వీడియో కూడా విడుదల చేయకపోవడంతో కారు పార్టీకి కలిసి రాలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం అయిన సర్పంచ్‌లను తన ఎర్రవెల్లి వ్యవసాయక్షేత్రంలో కలిశారు కేసీఆర్. ఈ సందర్భంగా మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే అని ధీమాగా చెప్పడం, గత పదేళ్లలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని వివరించి బీఆర్‌ఎస్ నేతల్లో భరోసా నింపారని చర్చించుకుంటున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఓటమితో కాస్త డీలా పడ్డా నేతలకు నేనున్నా అనే భరోసానిచ్చారనే చర్చ జరుగుతోంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల వేళ కేసీఆర్ సందేశం.. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయట.

రాష్ట్రంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకతను క్యాచ్ చేసుకొని అధికారంలోకి వస్తామని బీఆర్‌ఎస్ పదే పదే అంటుంది. కానీ కార్యాచరణలో ఆ ప్రయత్నాలేవి కనిపించకపోవడం..పార్టీ లీడర్లు తెలంగాణ భవన్‌ను వదిలి నియోజకవర్గానికి వెళ్లక పోవడం బీఆర్‌ఎస్‌కు నష్టం చేస్తుందన్న చర్చ జరుగుతోంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఆమె చాలా నియోజకవర్గాల్లో బిఆర్ ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అందుకు ప్రతిగా బిఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడ ప్రెస్‌మీట్లు పడుతూ కౌంటర్లు ఇస్తున్నారు. కవిత ఎపిసోడ్ కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతినిత్యం బిఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ ప్రసంగిస్తుంది. కాళేశ్వరం, విద్యుత్ ,భూ భారతితోపాటు ఫార్ములా ఈ-కారు రేస్‌లో అవకతవకలపై ఇబ్బంది పెట్టే విధంగా హస్తం పార్టీ కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది. ఇలాంటి తరుణంలో కేసిఆర్ బిఆర్ఎస్ కార్యకర్తలకు భరోసా నింపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఇప్పటికే మొదలైందని వచ్చే రోజుల్లో ఇంకా వ్యతిరేకత ఎక్కువగా వస్తుందని కేసీఆర్ నేతలకు దిశా నిర్దేశం చేశారట.

తెలంగాణ ప్రజలకు గతంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మరోసారి బీఆర్ఎస్‌ను గెలిపిస్తాయనే ధీమా వ్యక్తం చేస్తున్నారట కేసీఆర్. ప్రజలకి మన అవసరం ఉన్నప్పుడు వెళ్తేనే.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా గులాబీ కండువా అండగా ఉంటుందని బలంగా నమ్ముతారని చెబుతున్నారట. ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించాలని... కెసిఆర్ నేతలకు దిశా నిర్దేశం చేశారట. బిఆర్‌ఎస్ ముఖ్య నేతలు హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటున్నారు..ప్రజల్లో ఉంటేనే ప్రజలు పార్టీ వైపు ఉండి పట్టం కడతారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేయడంతో కేసీఆర్ ప్రజల్లోకి తొందర్లలోనే వస్తారని బిఆర్ ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories