Etela Rajender: సింగరేణిని ప్రైవేట్‌ పరం చేసేందుకు కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నాడు

KCR Is Trying To Privatize Singareni Says Etela Rajender
x

Etela Rajender: సింగరేణిని ప్రైవేట్‌ పరం చేసేందుకు కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నాడు

Highlights

Etela Rajender: తెలంగాణ ఏర్పడ్డాక 63 వేల మంది కార్మికులు ఉన్న సింగరేణి.. ప్రస్తుతం 43 వేల మంది కార్మికులకు పడిపోయింది

Etela Rajender: తెలంగాణ వచ్చాక 100 సంవత్సరాల పైబడి ఘన చరిత్ర ఉన్న సింగరేణి పూర్వ వైభవం కోల్పోయిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. సింగరేణిని ప్రైవేట్‌ పరం చేసేందుకు కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నాడని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక 63 వేల మంది కార్మికులు ఉన్న సింగరేణిలో ప్రస్తుతం 43 వేల మంది కార్మికులకు పడిపోయిందన్నారు. .సింగరేణి యాజమాన్యాన్ని బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఇవ్వకుండా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నాడన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఓడిపోతామనే భయంతో కేసీఆర్‌ సింగరేణి ఎన్నికలు నిర్వహించడం లేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories