KCR: నేడు ఫాంహౌస్‌లో కేసీఆర్ కీలక సమావేశం

KCR: నేడు ఫాంహౌస్‌లో కేసీఆర్ కీలక సమావేశం
x
Highlights

KCR: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) నేడు ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌లో అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించనున్నారు.

KCR: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) నేడు ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌లో అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ మరియు హైదరాబాద్ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, ముఖ్య నేతలతో ఈ సమావేశం జరగనుంది.

ఈ భేటీలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావుతో పాటు ఆయా జిల్లాలకు చెందిన కీలక నేతలు పాల్గొననున్నారు. ప్రధానంగా దక్షిణ తెలంగాణకు జీవనాడి అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కేసీఆర్ ఈ సమావేశంలో చర్చించనున్నారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెడుతోందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశంపై నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభల తేదీలను ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. నీటి వాటాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టేలా కార్యాచరణ రూపొందించనున్నారు.

గత కొద్దిరోజులుగా ఎర్రవెల్లి వేదికగా కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరీ ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల నేతలతో భేటీ కావడం, ఆ జిల్లాల్లో పర్యటనలకు సిద్ధమవుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచుతోంది.

త్వరలోనే ఈ మూడు జిల్లాల్లో సభలు నిర్వహించి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం సభల వివరాలు, పార్టీ తదుపరి పోరాట పంథాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories