Danam Nagender: నేను కాంగ్రెస్‌లోనే ఉన్నా.. వాళ్ల సంగతి తెలియదు..!

Danam Nagender: నేను కాంగ్రెస్‌లోనే ఉన్నా.. వాళ్ల సంగతి తెలియదు..!
x
Highlights

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తెలియదన్నారు. జీహెచ్ఎంసీ ORR వరకు విస్తరించడంతో హైదరాబాద్ మరింత అబివృద్ది చెందుతుందని దానం నాగేందర్ చెప్పారు. ఎంఐఎంతో కలుపుకొని జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ మూడు వందల డివిజన్లలో గెలుస్తుందన్నారు. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని దానం చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మూడు వందల డివిజన్లలో తిరుగుతానని. కాంగ్రెస్ పథకాలను ప్రజలకు వివరిస్తానని దానం ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories