Komatireddy Venkat Reddy: రేవంత్‌ పెద్ద తప్పు చేశారు.. ఇకపై ఆయన ముఖం కూడా చూడను..

Komatireddy Venkat Reddy: పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ముఖం చూసేది లేదని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Arun Chilukuri
Updated on: 5 Aug 2022 1:23 PM IST
Komatireddy Venkat Reddy Salms Revanth Reddy
X

Komatireddy Venkat Reddy: రేవంత్‌ పెద్ద తప్పు చేశారు.. ఇకపై ఆయన ముఖం కూడా చూడను..

Komatireddy Venkat Reddy: పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ముఖం చూసేది లేదని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆయన ఫైరయ్యారు. తనను ఎన్నికల్లో ఓడించాలని ప్రయత్నించిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ఆయన ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి పెద్ద తప్పు చేశారని వ్యాఖ్యానించారు. ఇకపై రేవంత్‌రెడ్డి ముఖం కూడా చూడనని వెంకట్‌రెడ్డి అన్నారు. పార్లమెంటు సమావేశాల తర్వాతే మునుగోడుకు వెళ్తానని చెప్పారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ నేడు కాంగ్రెస్‌పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పైవిధంగా స్పందించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story