Kondagattu Bus Tragedy: కొండగట్టు బస్సు దుర్ఘటనకు 7 ఏళ్లు

Kondagattu Bus Tragedy: కొండగట్టు బస్సు దుర్ఘటనకు 7 ఏళ్లు
x

Kondagattu Bus Tragedy: కొండగట్టు బస్సు దుర్ఘటనకు 7 ఏళ్లు

Highlights

కొండగట్టులో బస్సు ప్రమాద ఘటన జరిగి సరిగ్గా ఏడెళ్లయ్యింది..కానీ నేటికి ఆ నాటి ఆర్త నాధాలు అక్కడి వారిని వెంటాడుతున్నాయి...ఆ ఒక్కరోజు ఆ ప్రయాణం చేయకుంటే ఎంత బాగుండూ అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి ఆ గ్రామాలు...ఏళ్లు గడిచినా..మాయని గాయం ఆ నాటి ఘటన..ఇవాళ్టికీ వెంటాడుతున్న జ్టాపకాలను తలచుకొని కుమిలికుమిలి ఏడుస్తారు ఆ గ్రామస్తులు

కొండగట్టులో బస్సు ప్రమాద ఘటన జరిగి సరిగ్గా ఏడెళ్లయ్యింది..కానీ నేటికి ఆ నాటి ఆర్త నాధాలు అక్కడి వారిని వెంటాడుతున్నాయి...ఆ ఒక్కరోజు ఆ ప్రయాణం చేయకుంటే ఎంత బాగుండూ అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి ఆ గ్రామాలు...ఏళ్లు గడిచినా..మాయని గాయం ఆ నాటి ఘటన..ఇవాళ్టికీ వెంటాడుతున్న జ్టాపకాలను తలచుకొని కుమిలికుమిలి ఏడుస్తారు ఆ గ్రామస్తులు


సెప్టెంబర్ 11 ..,2018 .. ఈ డేట్ వింటే చాలు కొండగట్టు పరిసర గ్రామాల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి..ఆ నాటి బస్సు ప్రమాద ఘటనకి ఏడేళ్లు గడిచినా వారిని ఇంకా ఆ జ్ఘాపకాలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి...కొండగట్టుకి అత్యంత సమీపంలో ఉండే శనివారం పేట గ్రామం నుండి 80 మందికి పైగా ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. ఈ బస్సులోనే డెలివరీ కోసం వెళ్తున్న నిండు గర్భిణీ...బ్యాంకు పనిమీద వెళ్తున్న వృద్దులు...జగిత్యాల మార్కెట్ కి వెళ్తున్న మహిళా రైతులు...ఇలా చుట్టు పక్కల ఉన్న 4 గ్రామాల్లోని రకరకాల ప్రజలు బస్సు ఎక్కారు..

కొండగట్టు ఘాట్ రోడ్డు మీదుగా కిందకి దిగుతూంటే ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది...అంతే..కళ్లు మూసి తెరిచేలోపూ 48 మంది ప్రాణాలు అక్కడే గాలిలో కలిసిపోయాయి....మరికొందరు ఆసుపత్రికి తరలిస్తూంటే చనిపోయారు...ఇంకొందరూ కొంత కాలం వైద్యం తీసుకుంటూ ప్రాణాలతో పోరాడి కన్నుమూశారు...ఇలా ఒకే ప్రమాదంలో మొత్తం 67 మంది ప్రాణాలు కోల్పోయారు....అయితే ఈ ప్రమాదంలో గాయపడి చేతులు.,కాళ్లు పొగొట్టుకుని విగతజీవిగా జీవిస్తున్న వారి పరిస్దితి మరింత నరకప్రాయంగా మారింది...ఆ ప్రమాదంలో గాయపడి అటు మానసికంగా.,ఇటు శారీరకంగా కోలుకోలేక జీవితాన్ని వెల్లదీస్తున్న వారి సంఖ్య పదుల్లో ఉంది..అనాడు ఆ బస్సు ఎక్కపోయుంటే మా బతుకు బాగుండేదేమో సారూ అంటూ గుండెల నిండా దుఖం తో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

నాడు ఘటన స్దలంలో గుట్టలుగుట్టలు పేర్చిన మృతదేహాలు .... ఆ తరువాత 4 గ్రామాల్లో జరిగిన సామూహిక అంత్యక్రియలు ఇవన్నీ స్దానికులను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి...కాటికి కాలు జాపిన వృద్దుల నుండి అప్పుడే లోకాన్ని చూస్తే పసిపిల్లల వరకు అందరికి శవదహానం పక్కపక్కనే చేయాల్సిన దుస్దితి ఏర్పడిందని కాటి కాపరి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు..అంతటి దయనీయ స్దితి పగవాడికి కూడా రాకూడందంటూ బాధిత గ్రామాలు నేటికి బోరున విలపిస్తున్నాయి..అయితే ఇంతటి దారుణ ఘటన తరువాత బాధిత కుటుంబాలకు సరైన న్యాయం జరగలేదనే విమర్శలున్నాయి...కేవలం పరిహారం కింద కొంత డబ్బు ఇచ్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వం వీరికి మానిసక స్దైర్యాన్ని కల్పించే ప్రయత్నాలు చేయలేకపోయాయి. గాయపడి ఇంటికే పరిమితమైన వారికి కనీస ఉపాది కల్పించలేకపోయిందన్న విమర్శలు ఉన్నాయి.

దేశంలోనే అత్యంత దారుణ ఘటనగా చరిత్రలోకి ఎక్కిన కొండగట్టు బస్సు ప్రమాద ఘటన రాజకీయంగానూ ప్రకంపనలు లేపింది..కానీ ఇప్పటకీ ప్రమాదం జరిగిన ఘాట్ రోడ్డులో సరైన భద్రత ప్రమాణాలు ఏర్పాటు చేయలేదు. చిన్న చిన్న నిబందనలు మినహా అదే ప్రమాద స్దాయిలో ఘాట్ రోడ్డు ఉంది. నిజానికి ఆ బస్సు ప్రమాదం తరువాత కూడా చిన్న చిన్న ప్రమాదాలు ఇక్కడ జరిగాయి. కానీ నష్ట తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో చర్చల్లోకి రాలేదు. కొండగట్టుకి భద్రత తో కూడిన కొత్త ఘాట్ రోడ్డు నిర్మాణం చేస్తామంటూ నాయకులు చేసిన ప్రమాణాలు నీటిపై రాతలైయ్యాయి...భక్తులకు, స్దానిక గ్రామాలకు సరైన భద్రత నేటికి ఇవ్వలేకపోతున్నారు అధికారులు. ఇప్పటికైనా అధికారులు ప్రమాదాలు జరగకుండా కొత్త ఘాట్ రోడ్డు నిర్మాణం చేయాలని స్థానికులు కోరుతున్నారు... నాడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఇవాళ అధికారంలో ఉంది..మరి ఇప్పుడైనా అడుగు ముందుకి పడుతుందా లేదా చూడాలి...

Show Full Article
Print Article
Next Story
More Stories