KTR: రేవంత్ – బీజేపీల రహస్య మైత్రికి.. ఇది తాజా ఉదాహరణ మాత్రమే!

KTR: రేవంత్ – బీజేపీల రహస్య మైత్రికి.. ఇది తాజా ఉదాహరణ మాత్రమే!
x
Highlights

KTR: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య రహస్య మైత్రి కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు.

KTR: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య రహస్య మైత్రి కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి "చోటే భాయ్‌కి చీమ కూడా కుట్టకుండా బడే భాయ్ పార్టీ బీజేపీ పహారా కాస్తుంది" అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఎన్ని సమస్యలు తలెత్తినా, ముఖ్యమంత్రి ఎన్ని స్కాములకు పాల్పడినా, బీజేపీ మాత్రం ఏమాత్రం స్పందించడం లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇటీవల హైకోర్టు గ్రూప్-1 పరీక్షలో జరిగిన అవకతవకలపై తీవ్రంగా స్పందించి, పరీక్షను రద్దు చేయాలని ఆదేశించినప్పటికీ, రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం మౌనం వహించారని ఆయన పేర్కొన్నారు.

"విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన ఈ నిర్లక్ష్యంపై, డబ్బులకు జాబులు అమ్ముకున్నారన్న ఆరోపణలపై బీజేపీ మౌనానికి కారణమేమిటి?" అని కేటీఆర్ ప్రశ్నించారు. "బీఆర్ఎస్ హయాంలో ఏ చిన్న సమస్య వచ్చినా సీబీఐ విచారణ కోరిన బీజేపీ నేతలు, ఇప్పుడు గ్రూప్-1 స్కాంపై అదే విచారణను ఎందుకు కోరడం లేదు?" అని ఆయన నిలదీశారు.

ఈ మొత్తం వ్యవహారం రేవంత్ రెడ్డికి, బీజేపీకి మధ్య ఉన్న రహస్య మైత్రికి తాజా ఉదాహరణ మాత్రమేనని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ రెండు పార్టీల మధ్య తెర వెనుక ఒప్పందాలు ఉన్నాయనడానికి ఇది స్పష్టమైన సంకేతమని ఆయన ఆరోపించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories