KTR: తెలంగాణను ఏఐసీసీకి ఏటీఎంలా మార్చేశారు: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు!

KTR: తెలంగాణను ఏఐసీసీకి ఏటీఎంలా మార్చేశారు: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు!
x

KTR: తెలంగాణను ఏఐసీసీకి ఏటీఎంలా మార్చేశారు: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు!

Highlights

KTR: AICCకి తెలంగాణను ఏటీఎంలా సీఎం రేవంత్ మార్చారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

KTR: AICCకి తెలంగాణను ఏటీఎంలా సీఎం రేవంత్ మార్చారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రెండేళ్లుగా ఈ విషయాన్ని చెబుతున్నామని, ఇప్పుడు రేవంత్‌రెడ్డి డైరెక్ట్‌గా ఒప్పుకున్నారని ఆయన అన్నారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశారు. రాష్ట్ర సంపదను కాంగ్రెస్‌ అధిష్ఠానానికి రేవంత్‌రెడ్డి ధారపోస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని ఫైరయ్యారు.

రాష్ట్రాభివృద్ధికి నిధులు లేవంటున్న ప్రభుత్వం.. రెండేళ్లలో 3 లక్షల కోట్లను అప్పును తెచ్చిందని తెలిపారు. ప్రజల సొమ్మును ప్రజాప్రయోజనాలకు వాడకుండా పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇళ్లను, లగచర్ల గిరిజన భూములను, HCU విశ్వవిద్యాలయ భూములను కూడా వదలట్లేదన్నారు. హిల్ట్‌ పాలసీ పేరిట పరిశ్రమల భూములను లూటీ చేస్తున్నారని ఆగ్రహించారు. రేవంత్‌ తన పదవిని కాపాడుకోవడం కోసం ఢిల్లీకి మూటలు మోయడమే ఎజెండాగా పెట్టుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజలు అలర్ట్‌గా ఉండాలని పేర్కొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories