KTR: రెండున్నరేళ్లలో అధికారంలోకి వస్తాం.. అందరి లెక్కలు సరిచేస్తాం

KTR: రెండున్నరేళ్లలో అధికారంలోకి వస్తాం.. అందరి లెక్కలు సరిచేస్తాం
x
Highlights

KTR: తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (BRS) మళ్లీ రెండున్నరేళ్లలో అధికారంలోకి వస్తుందని, అప్పుడే అందరి లెక్కలు సరిచేస్తామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు.

KTR: తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (BRS) మళ్లీ రెండున్నరేళ్లలో అధికారంలోకి వస్తుందని, అప్పుడే అందరి లెక్కలు సరిచేస్తామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ మాట్లాడుతూ, “కేసీఆర్ పాలనలో అందరికీ న్యాయం జరిగింది. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి విచిత్రంగా మారిపోయింది. రాష్ట్రంలో భూవిలువలు పడిపోయాయి. రైతులు యూరియా కోసం పడిపాట్లు పడుతున్నారు. ఐఏఎస్ అధికారులు రేషన్ కార్డులపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. వారికి రాజకీయాలపై మాట్లాడే హక్కు లేదు,” అని అన్నారు.

రాష్ట్రంలో రుణమాఫీ పూర్తిగా విఫలమైందని ఆరోపించిన కేటీఆర్, “ఓటు వేసిన తర్వాత కాదు, నాట్లు వేసే సమయంలోనే రైతుబంధు అందాలి. కానీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతుబంధును నిలిపివేస్తోంది. ఇది రైతులపై వివక్షకు నిదర్శనం,” అన్నారు.

“బీసీ సబ్‌ప్లాన్‌ను ప్రవేశపెట్టాలంటే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలి. కానీ ప్రభుత్వం దానిపై జాప్యం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ పేరొస్తేనే భయపడుతున్నారు. దిల్లీలోకూడా ఆయనపై విమర్శలు చేస్తుండటం అదే సూచిస్తోంది,” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

“BRS ప్రభుత్వ హయాంలో చేసిన మంచి పనులను కార్యకర్తలు ప్రజల్లో సమర్థవంతంగా చాటలేకపోయారు. అందుకే ఓటమి ఎదురైంది. ఇకపై మేమంతా కలిసికట్టుగా పనిచేస్తూ కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాలి,” అని కేటీఆర్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories