రిజర్వేషన్‌తో జాక్‌పాట్.. తెలంగాణలో ఒకే కుటుంబానికి సర్పంచ్, రెండు వార్డు పదవులు!

రిజర్వేషన్‌తో జాక్‌పాట్.. తెలంగాణలో ఒకే కుటుంబానికి సర్పంచ్, రెండు వార్డు పదవులు!
x

రిజర్వేషన్‌తో జాక్‌పాట్.. తెలంగాణలో ఒకే కుటుంబానికి సర్పంచ్, రెండు వార్డు పదవులు!

Highlights

Erkala Bhimappa: లోకల్ బాడీ ఎలక్షన్‌ ఓ పేద కుటుంబానికి జాక్ పాట్ తెచ్చింది.

Erkala Bhimappa: లోకల్ బాడీ ఎలక్షన్‌ ఓ పేద కుటుంబానికి జాక్ పాట్ తెచ్చింది. రిజర్వేషన్ల పుణ్యామా అని ఒకే కుటుంబానికి సర్పంచ్‌తో పాటు రెండు వార్డు మెంబర్ పదవులు దక్కనున్న ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతన్‌గౌడ్ గ్రామంలో ఎస్టీ రిజర్వేషన్ ఖరారైంది. 494 మంది ఓటర్లు ఉన్న గ్రామంలో ఎరుకల భీమప్ప కుటుంబం మాత్రమే ఏకైక ఎస్టీ కుటుంబం. దీంతో సర్పంచ్ పదవి భీమప్ప కుటుంబానికే దక్కడం ఖాయమైంది. గ్రామంలో ఉన్న 8 వార్డులలో రెండు వార్డులు స్థానాల్లో కూడా ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళకు రిజర్వ్ చేశారు. ఈ రెండు స్థానాలు కూడా వీరి కుటుంబానికే దక్కనున్నాయి.

గ్రామంలోని చీపుర్లు, బుట్టలు అల్లుకుంటూ భార్య వెంకటమ్మతో కలిసి భీమప్ప జీవనం సాగిస్తున్నారు. భీమప్పకు ఇద్దరు కుమారులు ఎల్లప్ప, మహేశ్ , కోడళ్లు స్వప్న, సుజాత ఉన్నారు. కుమారులు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నిజానికి భీమప్ప కుటుంబ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేస్తామని అనుకున్నారో లేదో గాని ... అదృష్టం మాత్రం వారి తలుపు తట్టింది. రాజకీయ నాయకుల కుటుంబం దిశగా మారే అవకాశాన్ని కల్పించింది. ఒక్కటే నామినేషన్ దాఖలైతే .. మంతన్‌గౌడ్ ఎన్నిక ఏకగ్రీవమవుతుంది.

స్థానిక సంస్థల ఎన్నికలు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులను మార్చేస్తాయని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఊహించని విధంగా వచ్చిన రాజకీయ అవకాశం వారి జీవితంలో కొత్త వెలుగులు నింపబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories