Hyderabad: లూలూ మాల్‌లో షాపింగ్ హంగామా.. ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్‌పై 50% వరకు భారీ డిస్కౌంట్లు!

Hyderabad: లూలూ మాల్‌లో షాపింగ్ హంగామా.. ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్‌పై 50% వరకు భారీ డిస్కౌంట్లు!
x

Hyderabad: లూలూ మాల్‌లో షాపింగ్ హంగామా.. ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్‌పై 50% వరకు భారీ డిస్కౌంట్లు!

Highlights

హైదరాబాద్ నగరవాసులకు ఈ సమ్మర్ షాపింగ్‌ను మరింత ఉత్సాహంగా మార్చేందుకు కేపీహెచ్‌బీ లూలూ మాల్ ప్రత్యేక షాపింగ్ ఫెస్టివల్‌ను ప్రారంభించింది.

Lulu Mall Mega Sale in Hyderabad: హైదరాబాద్ నగరవాసులకు ఈ సమ్మర్ షాపింగ్‌ను మరింత ఉత్సాహంగా మార్చేందుకు కేపీహెచ్‌బీ లూలూ మాల్ ప్రత్యేక షాపింగ్ ఫెస్టివల్‌ను ప్రారంభించింది. జూలై 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఈ మాస్ డిస్కౌంట్ సేల్ జరుగనుంది. ఈ సందర్భంగా హైపర్ మార్కెట్, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో 50 శాతం వరకు ఆఫర్లు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు.

ఫ్యాషన్ విభాగంలో ట్రెండీ దుస్తులు, షూస్, స్పోర్ట్స్‌వేర్, బ్యాగులు, యాక్సెసరీస్‌లపై భారీ తగ్గింపులు లభించనున్నాయి. ఇక ఎలక్ట్రానిక్స్ విభాగంలో టీవీలు, మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, కిచెన్ అప్లయన్సెస్, స్పీకర్లు వంటి పలు ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు కొనసాగనున్నాయి. గృహోపయోగ వస్తువులు, రోజువారీ అవసరాల వస్తువులపై కూడా తగ్గింపులు ఉన్నట్లు సమాచారం.

ఈ డిస్కౌంట్ సేల్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో చురుగ్గా ప్రచారం జరుగుతోంది. షాపింగ్ ప్రియులు, యువత, గృహిణులు ఈ అవకాశాన్ని వదులుకోకుండా ముందుగానే మాల్‌కి రాబోతున్నారని నిర్వాహకులు తెలిపారు. ఫుడ్ కోర్ట్, కిడ్స్ ప్లే జోన్, మల్టీప్లెక్స్ థియేటర్ వంటి వినోదం సదుపాయాల వల్ల కుటుంబాలతో కలిసి వస్తే మరింత ఆనందాన్ని అందుకోవచ్చని వారు పేర్కొన్నారు.

లూలూ మాల్‌లో షాపింగ్ సమయాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటాయి. ఈ ఆఫర్లు అత్యుత్తమ బ్రాండ్లను తక్కువ ధరలకు అందించే అరుదైన అవకాశమని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ఇంత భారీ డిస్కౌంట్ మళ్లీ రాకపోవచ్చన్న అంచనాతో మీరు కూడా మీ షాపింగ్ లిస్ట్‌తో వెంటనే మాల్‌కి వెళ్లిపోవాల్సిందే!

Show Full Article
Print Article
Next Story
More Stories