మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్‌ ఆగ్రహం

Mahesh Kumar Goud Slams Ponguleti on Reservation Announcement
x

మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్‌ ఆగ్రహం

Highlights

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటించిన విషయాన్ని ఆయన తప్పుపట్టారు. అలాంటి ముఖ్యమైన అంశాలను ముందుగా క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, కాని మీడియాతో ఇలా వ్యాఖ్యానించడం సరికాదని మండిపడ్డారు.

పార్టీలో ముందుగా చర్చించకుండా వ్యక్తిగతంగా నిర్ణయాలు ప్రకటించడం తగదని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మరో మంత్రిత్వశాఖకి సంబంధించిన అంశాలపై వేరే మంత్రులు మాట్లాడటం అసహజమని, అలాంటి విషయాల్లో బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు. కోర్టు పరిధిలో ఉన్న సున్నితమైన విషయాలపై మాట్లాడేటప్పుడు మంత్రులు అన్ని కోణాల్లో ఆలోచించి, సమగ్రంగా పరిశీలించి మాట్లాడాలని సూచించారు. శాఖలకు సంబంధించిన విషయాలకే పరిమితం కావాలని హితవు పలికారు.

Show Full Article
Print Article
Next Story
More Stories