Peddapalli: దారుణం..వివాహేతర సంబంధం ప్రశ్నించినందుకు... 10 నెలల పాపను తన్ని చంపిన తండ్రి!

Peddapalli: దారుణం..వివాహేతర సంబంధం ప్రశ్నించినందుకు... 10 నెలల పాపను తన్ని చంపిన తండ్రి!
x

Peddapalli: దారుణం..వివాహేతర సంబంధం ప్రశ్నించినందుకు... 10 నెలల పాపను తన్ని చంపిన తండ్రి!

Highlights

Peddapalli: భర్త వివాహేత సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని.. భార్య ప్రశ్నించింది. కోపోద్రిక్తుడైన అతడు పది నెలల పాపను కాలితో తన్ని మంచానికేసి కొట్టాడు.

Peddapalli: భర్త వివాహేత సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని.. భార్య ప్రశ్నించింది. కోపోద్రిక్తుడైన అతడు పది నెలల పాపను కాలితో తన్ని మంచానికేసి కొట్టాడు. దీంతో ఆ పసికందు చనిపోయింది. ఈ దారుణ ఘటన పెద్దపల్లి జిల్లా దేవునిపల్లిలో చోటుచేసుకుంది. దేవునిపల్లికి చెందిన హరీష్‌కు అదే గ్రామానికి చెందిన భవానితో పెళ్లయ్యింది. వారికి పదే నెలల పాప ఉంది. హరీష్‌ ఇతరులతో వివాహేతర సంబంధం కలిగి ఉన్న విషయం భార్యకు తెలిసింది. దీంతో వారి మధ్య కొంతకాలంగా వాగ్వాదం జరుగుతోంది. అదే సమయంలో చిన్నారి తల్లిదండ్రుల దగ్గరకు పాకుతూ వచ్చింది. కోపోద్రిక్తుడైన హరీష్‌ పాపను కాలితో తన్ని.. చిన్నారిని మంచానికి బాదాడు. అనంతరం చిన్నారి పాలు తాగకపోవడంతో తల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. అయితే అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

అయితే ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని హరీశ్ తన భార్యను బెదిరించాడు. పాపమంచంపై నుంచి పడి చనిపోయిందని అందరినీ నమ్మించాడు. ఇటీవల గ్రామంలో ఓ వివాహేతర సంబంధం విషయంలో గతనెల 29న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఆ ఘటనలో హరీశ్‌పై పోక్సో కేసు నమోదైంది. ఈ క్రమంలో కన్న కూతురిని హరీశ్ చంపాడని భార్య భవాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో చిన్నారిహత్య వెలుగు చూసింది. పోలీసులు దేవునిపల్లిలో పాప మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories