మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగుబాటు ..రెడ్ రివల్యూషన్‌కి షాక్!

మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగుబాటు ..రెడ్ రివల్యూషన్‌కి షాక్!
x

మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగుబాటు ..రెడ్ రివల్యూషన్‌కి షాక్!

Highlights

మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ మావోయిస్టు పార్టీని వీడిన మల్లోజుల వేణుగోపాల్ రావు మావోయిస్టు అగ్రనేత మల్లోజుల పోలీసుల ముందు లొంగుబాటు గడ్చిరోలి పోలీసుల ముందు 60 మంది మావోయిస్టులతో కలిసి లొంగుబాటు

మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు ఛత్తీస్‌గఢ్‌ గచ్చిరోలిలో 60 మంది మావోయిస్టులతో పోలీసుల ఎదుట లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఇంతకాలం కొనసాగారు. ఇకపై పార్టీలో కొనసాగబోనని..అనివార్య కారణల వల్ల పార్టీని వీడుతున్నట్టు ఇటీవల ప్రకటించారు. విప్లవోద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి బహిరంగంగా ప్రజల్లోకి వెళ్లడం మినగా మరో మార్గం లేదంటూ ఆయన రాసిన లేఖ కలకలం రేపింది. ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు వెళ్లాలని గతంలోనూ మల్లోజుల రాసిన లేఖను మావోయిస్టు అగ్రనేతలు హిడ్మా, దేవ్ జీ వ్యతిరేకించారు. ఇందుకు ప్రతిగా వేణుగోపాల్ 22 పేజీల సుదీర్ఘ లేఖను విడుదల చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


మల్లోజుల వేణగోపాల్ స్వగ్రామం జగిత్యాల జిల్లా పెద్దపల్లి. 30 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో కొనసాగారు. మల్లోజులపై వందకు పైగా కేసులు నమోదు అయ్యాయి. మల్లోజుల మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు. ఇంత కాలం పార్టీ చేసిన తప్పులకు, ఉద్యమం ఓడిపోకుండా కాపాడలేక పోయినందుకు బాధ్యత వహిస్తూ పొలిట్ బ్యూరో సభ్యుడిగా క్షమాపణలు కోరుతున్నట్టు చెప్పారు. ఇంత నష్టానికి, ఇన్ని బలిదానాలకు దారితీసిన విప్లవోద్యమ బాధ్యతల్లో కొనసాగడానికి ఇక ఎంతమాత్రం అర్హుడిని కాదని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం సరైంది కాదని భావించవచ్చు. కానీ పరిస్థితులు దీన్ని అనివార్యంగా చేశాయి. వందల మంది మావోయిస్టులను కోల్పోతున్న పరిస్థితుల్లో పార్టీ పిడివాద, అతివాద విధానాల నుంచి మిగిలిన వారినైనా కాపాడుకోవాలి. 28 ఏళ్లు కేంద్ర కమిటీ, 18 ఏళ్లు పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పార్టీలో ఎన్నో లోపాలను గమనించాని లేఖలో పేర్కొన్నారు.

1998 నుంచి ఉమ్మడి ఏపీలో దెబ్బతింటూ వచ్చామని.. 2003లో ఉత్తర తెలంగాణ నుంచి బలగాలను దండకారణ్యానికి తరలించామన్నారు. 2005 నాటికి ఏపీలో మావోయిస్టు పార్టీ పూర్తిగా దెబ్బతిన్నదని. మన బలాన్ని ఎక్కువగా, ప్రత్యర్థి బలాన్ని తక్కువగా అంచనా వేయడం తప్పుడు నిర్ణయమన్నారు. మావోయిస్టు పార్టీ బేస్‌ క్యాంపులు ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆదివాసీ రైతులకు ప్రభుత్వాలు ఇచ్చే భూమి పట్టాలు వద్దన్నామన్నారు. ఇందుకు ప్రతిగా జనతన సర్కారే పట్టాలిస్తుందని చెప్పాం. కానీ ఆ పట్టాలకు విలువలేదని, రైతుల అవసరాలు తీర్చలేవని కేంద్ర కమిటీ గ్రహించలేకపోయింది.

సర్కారు బడుల్లో చదువులకు కూడా విలువ లేకుండా పోయిందని. చివరకు ప్రజలు ఆధార్‌కార్డులు తెచ్చుకోవడాన్నీ వ్యతిరేకించాల్సి వచ్చిందని మల్లోజుల చెప్పారు. ప్రజలు చాటుగా వెళ్లి వాటిని తెచ్చుకున్నారు. ఇలాంటి తప్పులు సరిదిద్దుకోవాలంటే ప్రజల మధ్యకు వెళ్లాలి. ఇప్పుడు ఉద్యమాన్ని కాపాడుకోవడం, కేడర్‌ను రక్షించుకోవడం కావాలి. అనవసర త్యాగాలకు అంతం పలుకుతూ నూతన పద్ధతుల్లో పురోగమిస్తే అంతిమ విజయం ప్రజలదే అంటూ లేఖలో రాశారు. ఈ లేఖ పూర్తిగా చదివి, సహచరులతో చర్చించి, తగు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నా’ అంటూ తోటి మావోయిస్టు నాయకులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

మల్లోజుల రాసిన లేఖను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆయుధాలను సరెండర్‌ చేయాలని ఆయన్ని ఆదేశించింది. ఈ లేఖల యుద్ధం కొనసాగుతున్న తరుణంలోనే ఆయన పోలీసులకు లొంగిపోవడం గమనార్హం. ఆయన ఆయుధాలు వదిలేసినట్లు గచ్చిరోలి అధికారిక వర్గాలు ధృవీకరించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories