Armoor: వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణీ మృతి

Armoor: వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణీ మృతి
x
Highlights

Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని శ్రీ బాల్రాజ్ మెమోరియల్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందింది.

Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని శ్రీ బాల్రాజ్ మెమోరియల్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందింది. ఆర్మూర్‌కి చెందిన శ్రీలత బాల్‌రాజ్ ఆస్పత్రిలో మగ బిడ్డకి జన్మనిచ్చింది. వైద్యులు నిర్లక్ష్యంగా సర్జరీ చేయడంతో బాలింతకు తీవ్ర రక్తస్రావం అయింది.

బాలింత పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ కేంద్రంలోని మనోరమ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న క్రమంలో శ్రీలత మృతి చెందడంతో బాల్ రాజ్ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే శ్రీలత మరణించిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. మృతదేహంతో హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. పట్టణ సిఐ సత్యనారాయణ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని మృతురాలి బందులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories