Minister Konda Surekha: వరంగల్ సభ చరిత్రలో నిలిచిపోతుంది

Konda Surekha
x

Konda Surekha

Highlights

Minister Konda Surekha: వరంగల్ విజయోత్సవ (Warangal Vijayotsavam)సభ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అన్నారు.

Minister Konda Surekha: వరంగల్ విజయోత్సవ (Warangal Vijayotsavam) సభ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. గతంలో కేసీఆర్ (KCR) దగ్గర కూడా తాను పనిచేశానని.. బీఆర్ఎస్ (BRS) కూడా మీటింగ్‌లలో ఎన్నో వాగ్దానాలు చేసిందని.. కానీ ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. కానీ రాజశేఖర్ రెడ్డి చెప్పిన ప్రతి పనిని కూడా చేసేవారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. వరంగల్ విజయోత్సవ సభలో పాల్గొన్న కొండా సురేఖ.. నగరాన్ని హైదరాబాద్ తరహాలో గొప్పగా తీర్చిదిద్దే విధంగా మాస్టర్ ప్లాన్ చేయడం జరిగిందన్నారు. సుమారు రూ. 4,500 కోట్ల విడుదల చేస్తూ జీవో ఇచ్చారన్నారు.

వరంగల్ ప్రజలకు వరాల జల్లు కురిపించిన సీఎం రేవంత్‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఎయిర్ పోర్టు ఇక్కడి ప్రజల దశాబ్దాల కల అన్నారు. ఎయిర్ పోర్టు కలను ఎవరూ కూడా సాకారం చేయలేకపోయారని.. అది రేవంత్ అన్న వళ్లే సాధ్యమవుతుందన్నారు. ఎయిర్ పోర్టు వస్తే కంపెనీలు వస్తాయని.. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని... ఆర్థికంగా బాగుపడుతామన్నారు. ఎయిర్ పోర్టు వల్ల చాలా అభివృద్ధి జరుగుతుందన్నారు. అండర్ డ్రైనేజీ కూడా వరంగల్ ప్రజల కల అని అన్నారు. ఆ కల కలగానే మిగిలిపోతుందనుకున్నామని, కానీ దానిని నిజం చేసినందుకు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఏవైతే శంకుస్థాపనలు చేశారో వాటితో వరంగల్‌ను సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా పనులు జరిపిస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories