Seethakka: మంత్రి సీతక్కకు చేదు అనుభవం.. కాన్వాయ్‌ను అడ్డుకున్న రైతులు

Seethakka: మంత్రి సీతక్కకు చేదు అనుభవం.. కాన్వాయ్‌ను అడ్డుకున్న రైతులు
x

Seethakka: మంత్రి సీతక్కకు చేదు అనుభవం.. కాన్వాయ్‌ను అడ్డుకున్న రైతులు

Highlights

Seethakka: కామారెడ్డి‎లో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది.

Seethakka: కామారెడ్డి‎లో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. భిక్కనూరులో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న అనంతరం నిజామాబాద్ జిల్లా సిరికొండలోని ఎవరెస్ట్ శిఖర అధిరోహిత మాలావత్ పూర్ణ ను పరామర్శించేందుకు వెళ్తుండగా సీతక్క కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. సన్న రకం వరి ధాన్యానికి బోనస్ డబ్బులు ఇవ్వాలని, సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. దీంతో ఆగ్రహం చెందిన మంత్రి సీతక్క అసలు మీరు రైతులేనా.. అంటూ అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

డ్యూటీలో ఉన్న పోలీసు అధికారి ఫిర్యాదు మేరకు మంత్రి సీతక్క కాన్వాయ్‌ ముందుకు వచ్చి అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు పడిగల శ్రీనివాస్, పోసానిపేటకు చెందిన నారెడ్డి దశరథ్‌రెడ్డి, ఉప్పల్వాయికి చెందిన మాజీ సర్పంచ్ కొత్తొల్ల గంగారం, రామారెడ్డికి చెందిన బాలదేవ్ అంజయ్య, ద్యాగల మహిపాల్, హన్మయల్లా రాజయ్యపై కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories