Vemula Prashanth Reddy: బీఆర్‌ఎస్‌ పాలనలో గంగపుత్ర సోదరులు ఆర్థికంగా బలపడ్డారు

Vemula Prashanth Reddy: బీఆర్‌ఎస్‌ పాలనలో గంగపుత్ర సోదరులు ఆర్థికంగా బలపడ్డారు
x
Highlights

Vemula Prashanth Reddy: నిజామాబాద్‌ జిల్లా పోచంపాడు ప్రాజెక్టులో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు.

Vemula Prashanth Reddy: నిజామాబాద్‌ జిల్లా పోచంపాడు ప్రాజెక్టులో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు. బీఆర్‌ఎస్‌ పాలనలో గంగపుత్ర సోదరులు ఆర్థికంగా బలపడ్డారని అన్నారు. గతంలో కేసీఆర్‌ ఉన్నప్పుడు గంగపుత్ర సోదరుల చేపపిల్లల కోసం.. 35 కోట్ల వరకు ఖర్చు చేశారని ఎమ్మెల్యే వేముల గుర్తుచేశారు.

ఈ సంవత్సరం కోటి డెబ్భైనాలుగు లక్షల చేప పిల్లల పంపిణి చేస్తామన్న కాంగ్రెస్‌.. ఇంకా రొయ్య పిల్లలనే పంపిణీ చేయలేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ తొమ్మిది ఏండ్ల పాలనలో ఇచ్చిన విధంగా.. కాంగ్రెస్ ప్రభుత్వం గంగపుత్రులకు అన్ని సౌకర్యాలు అందించి అండగా ఉండాలని రేవంత్ రెడ్డి సర్కార్ను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories