ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు చేయండి- జడ్జి ఆదేశాలు

RS Praveen Kumar: మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు చేయాలని కరీంనగర్ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేసింది.

Arun Chilukuri
Updated on: 21 July 2021 6:45 PM IST
ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు చేయండి- జడ్జి ఆదేశాలు
X

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు చేయండి- జడ్జి ఆదేశాలు

RS Praveen Kumar: మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు చేయాలని కరీంనగర్ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేసింది. హిందూ దేవుళ్లపై విద్వేషపూరిత ప్రతిజ్ఞ చేశారంటూ ప్రవీణ్‌ కుమార్‌ వివాదంలో చిక్కగా ఆయనపై కేసు నమోదు చేయాలని మెజిస్ట్రేట్‌ ఆదేశాలిచ్చారు. ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదుకు కరీంనగర్‌ మూడో పట్టణ పోలీసులకు న్యాయమూర్తి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

2021 మార్చి 16న పెద్దపల్లి జిల్లా వడుకపూర్‌‌లో స్వేరోస్ భీమ్ దీక్ష జరగగా ఈ దీక్షకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్. దీక్షలో హిందూ విశ్వాసాలకు వ్యతిరేకంగా స్వేరోస్ సభ్యులు ఎడమచేతితో ప్రతిజ్ఞ చేశారు. వారితో పాటు ప్రవీణ్ కుమార్‌ కూడా ఎడమచేతితో ప్రతిజ్ఞ చేయగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో ప్రిన్సిపల్ మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు లాయర్ బేతి మహేందర్‌రెడ్డి. ఆయన ఫిర్యాదు మేరకు ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు మెజిస్ట్రేట్.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.